Ajith : ‘వలిమై’ రన్ టైమ్లో కోత.. 14 నిముషాలు తగ్గింపు..
'వలిమై' 180 నిముషాలు అనగా మూడు గంటల రన్ టైమ్ తో సినిమా రిలీజ్ అయింది. దీంతో చిత్ర యూనిట్ ఇప్పుడు రన్ టైమ్ తగ్గించినట్లు తెలుస్తుంది. వలిమై సినిమా నిడివిని కొంత మేరకు కుదించారు....
![Ajith : ‘వలిమై’ రన్ టైమ్లో కోత.. 14 నిముషాలు తగ్గింపు.. Ajith : ‘వలిమై’ రన్ టైమ్లో కోత.. 14 నిముషాలు తగ్గింపు..](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2022/02/valimai-1.webp)
Valimai
Valimai : అజిత్ హీరోగా, మన తెలుగు హీరో కార్తికేయ విలన్ గా వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ‘వలిమై’. ఈ సినిమా ఫిబ్రవరి 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. జీ సినిమాతో కలిసి బోనీ కపూర్ నిర్మించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి నాయకిగా నటించారు. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. తెలుగులో ఈ సినిమా ప్రభావం అంత లేకపోయినా తమిళ్ లో మాత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నట్టు సమాచారం. ‘వలిమై’ సినిమాలో ఫైట్స్, బైక్ ఛేజింగ్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి అంటూ అందరూ అభినందిస్తున్నారు.
అయితే ‘వలిమై సినిమా’ లెంగ్త్ ఎక్కువగా ఉందని, కొన్ని చోట్ల బోరింగ్ గా సాగిందని కొంతమంది అభిప్రాయపడ్డారు. రన్ టైమ్ ఎక్కువగా ఉందని ఆరోపించారు. 180 నిముషాలు అనగా మూడు గంటల రన్ టైమ్ తో సినిమా రిలీజ్ అయింది. దీంతో చిత్ర యూనిట్ ఇప్పుడు రన్ టైమ్ తగ్గించినట్లు తెలుస్తుంది.
BiggBoss : షో నచ్చకపోతే ఛానల్ మార్చుకో.. నారాయణపై ఫైర్ అయిన తమన్నా సింహాద్రి..
వలిమై సినిమా నిడివిని కొంత మేరకు కుదించారు. దాదాపు 14 నిమిషాల వరకు కట్ చేసినట్టు సమాచారం. 14 నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను తొలగించి ఇవాళ్టి నుంచి కొత్త వర్షన్ ని థియేటర్లలో వేయనున్నారు. రన్ టైమ్ లో కోత పడగా కొత్త వర్షన్ 166 నిముషాలు ఉండనుంది. ఇప్పటికే ‘వలిమై’ సినిమా 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 100 కోట్ల వైపు దూసుకెళ్తుంది.