BiggBoss : షో నచ్చకపోతే ఛానల్ మార్చుకో.. నారాయణపై ఫైర్ అయిన తమన్నా సింహాద్రి..

ప్రతి సారి బిగ్‌బాస్‌‌ ని వ్యతిరేకిస్తూ వచ్చే సిపిఐ నారాయణ తాజాగా మరోసారి బిగ్‌బాస్‌‌ షోని వ్యతిరేకిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘బిగ్‌బాస్‌’ లైసెన్స్‌ పొందిన ఓ అనైతిక షో అని......

BiggBoss : షో నచ్చకపోతే ఛానల్ మార్చుకో.. నారాయణపై ఫైర్ అయిన తమన్నా సింహాద్రి..

Tamanna

Tamanna Simhadri :  బిగ్‌బాస్‌‌ రియాలిటీ షో అన్ని భాషల్లో సక్సెస్ సాధిస్తూ తెలుగులో కూడా విజయవంతం అయింది. ఇప్పటికే అయిదు సీజన్లు పూర్తి చేసుకొని ఈ సారి బిగ్‌బాస్‌‌ నాన్ స్టాప్ గా 24/7 డిస్నిప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో నిన్నటి నుంచి టెలికాస్ట్ అవుతుంది.

ప్రతి సారి బిగ్‌బాస్‌‌ ని వ్యతిరేకిస్తూ వచ్చే సిపిఐ నారాయణ తాజాగా మరోసారి బిగ్‌బాస్‌‌ షోని వ్యతిరేకిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘బిగ్‌బాస్‌’ లైసెన్స్‌ పొందిన ఓ అనైతిక షో అని, అదొక బ్రోతల్ హౌస్ అని విమర్శలు చేశారు. ఈ విమర్శలపై బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్, ట్రాన్సజెండర్ తమన్నా సింహాద్రి స్పందించారు.

BiggBoss NonStop : బిగ్‌బాస్‌‌పై మరోసారి ఫైర్ అయిన సిపిఐ నారాయణ

తమన్నా సింహాద్రి స్పందిస్తూ నారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. బిగ్‌బాస్‌‌ కి సంబంధించి ఓ టీవీలో డిబేట్‌ షో ఏర్పాటు చేయగా తమన్నా సింహాద్రి మాట్లాడుతూ..”బిగ్‌బాస్‌ షోను బ్రోతల్‌ హౌస్‌ అన్నందుకు నారాయణను చెప్పుతో కొట్టాలి. ఈ షో వల్ల నాకు, ఇంకా ఎంతోమందికి గుర్తింపు వచ్చింది. ఉపాధి కూడా కలిగింది. సమాజంలో మాకంటూ ఓ సెలబ్రిటీ స్టేటస్ ఆ షో వల్లే వచ్చింది. ఒకవేళ షో నచ్చకపోతే ఆయన ఛానెల్‌ మార్చుకోవచ్చు” అని వ్యంగ్యంగా కామెంట్ చేసింది.