BiggBoss NonStop : బిగ్‌బాస్‌‌పై మరోసారి ఫైర్ అయిన సిపిఐ నారాయణ

సిపిఐ నారాయణ మాట్లాడుతూ.. ''రియాలిటీ షోగా చెబుతున్న ‘బిగ్‌బాస్‌’ లైసెన్స్‌ పొందిన ఓ అనైతిక షో. అన్నమయ్య వంటి సినిమాల్లో నటించిన హీరో నాగార్జున ఇలాంటి షోకు యాంకరింగ్‌ చేయడం.........

BiggBoss NonStop : బిగ్‌బాస్‌‌పై మరోసారి ఫైర్ అయిన సిపిఐ నారాయణ

Narayan

BiggBoss :  బిగ్‌బాస్‌‌ అన్ని భాషల్లో సక్సెస్ సాధిస్తూ తెలుగులో కూడా విజయవంతం అయింది. ఇప్పటికే అయిదు సీజన్లు పూర్తి చేసుకొని ఈ సారి బిగ్‌బాస్‌‌ నాన్ స్టాప్ గా 24/7 డిస్నిప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో నిన్నటి నుంచి టెలికాస్ట్ అవుతుంది. బిగ్‌బాస్‌‌ కి అభిమానులతో పాటు కొంతమంది వ్యతిరేకులు కూడా ఉన్నారు. గతంలో కూడా బిగ్‌బాస్‌‌ ని కొంతమంది వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అందులో సిపిఐ నారాయణ ఒకరు. తాజాగా మరోసారి సిపిఐ నారాయణ బిగ్‌బాస్‌‌ షోని వ్యతిరేకిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

శనివారం సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలకు నారాయణ అనంతపురం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అనంతపురంలోని ఓ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు.

Srabanti Chatterjee : సరదాగా ముంగిసతో ఫోటో దిగిన నటి.. కేసు పెట్టిన పోలీసులు..

సిపిఐ నారాయణ మాట్లాడుతూ.. ”రియాలిటీ షోగా చెబుతున్న ‘బిగ్‌బాస్‌’ లైసెన్స్‌ పొందిన ఓ అనైతిక షో. అన్నమయ్య వంటి సినిమాల్లో నటించిన హీరో నాగార్జున ఇలాంటి షోకు యాంకరింగ్‌ చేయడం అవమానం. ఈ షో ద్వారా ప్రజలకు ఏమి సందేశం ఇవ్వదల్చుకున్నారు. బిగ్‌బాస్‌ అనే లైసెన్స్‌ పొందిన షోలో కొంత మందిని 100 రోజుల పాటు ఒకచోట ఉంచి అనైతిక చర్యలకు పాల్పడేందుకు వీలు కల్పిస్తున్నారు. మహిళలను అవమానపరిచే విధంగా ఈ షో ఉంటుంది. దీన్ని ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నాం. షో నిలిపేయాలంటూ మేము డిజిటల్‌ క్యాంపెయిన్‌ చేపడుతున్నాము.” అని అన్నారు.