Srabanti Chatterjee : సరదాగా ముంగిసతో ఫోటో దిగిన నటి.. కేసు పెట్టిన పోలీసులు..

బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. ఇటీవల స్రబంతి గొలుసుతో కట్టేసి ఉన్న ఓ ముంగిసతో ఫోటో దిగి దాన్ని సోషల్‌ మీడియాలో షేర్ చేసింది.........

Srabanti Chatterjee :  సరదాగా ముంగిసతో ఫోటో దిగిన నటి.. కేసు పెట్టిన పోలీసులు..

Srabanthi

Updated On : February 27, 2022 / 2:42 PM IST

Srabanti Chatterjee :  బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. ఇటీవల స్రబంతి గొలుసుతో కట్టేసి ఉన్న ఓ ముంగిసతో ఫోటో దిగి దాన్ని సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. ఇది పాపులర్ అయి అటవీ శాఖ అధికారుల వరకు వెళ్ళింది. దీంతో అటవీశాఖ అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్లు 9, 11, 39, 48ఏ, 49, 49ఏ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించి జంతువులను అక్రమంగా పట్టుకోవడం, రవాణా చేయడం, స్వాధీనం చేసుకున్నందుకు ఈ బెంగాలీ నటిపై కేసులు నమోదు చేశారు.

 

కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను కోల్‌కతాలోని వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ సెల్, డేటా మేనేజ్‌మెంట్ యూనిట్ కార్యాలయం ముందు హాజరు కావాలని స్రబంతికి నోటీసులు పంపారు. ఈ విషయంపై స్రబంతి మీడియాతో మాట్లాడుతూ.. ”వన్య ప్రాణుల సంరక్షణ చట్టం గురించి నాకు అంతగా తెలియదు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. కాబట్టి నేను ఏమి మాట్లాడలేను” అని తెలిపింది.

Srabanthi Chatarjee

Shruthi Haasan : శృతి హాసన్‌కి కరోనా పాజిటివ్

స్రబంతి తరపు న్యాయవాది ఎస్‌కే హబీబ్‌ ఉద్దీన్‌ మాట్లాడుతూ.. ”స్రబంతి ఇంకా అధికారులను కలవలేదు. వారిని కలిసిన తర్వాత మాత్రమే మేము స్పష్టమైన వివరణ ఇవ్వగలం. అసలు కచ్చితమైన ఆరోపణలు ఏంటో తెలుసుకోవడానికి మేము త్వరలోనే అధికారులను కలుస్తాం” అని చెప్పారు. అంటే ఇప్పటి వరకు ఆమె నోటీసులు పంపినా అధికారులని కలవలేదని తెలుస్తుంది. అయితే ఈ ఫోటోలని మాత్రం సోషల్ మీడియా నుండి తొలిగించింది స్రబంతి.