Shruthi Haasan : శృతి హాసన్‌కి కరోనా పాజిటివ్

కమల హాసన్ కూతురు, హీరోయిన్ శ్రుతి హాసన్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ''హాయ్‌ ఎవర్రీవన్‌. ఇది సరదా అప్‌డేట్‌ కాదు. అన్ని జాగ్రత్తలు..

Shruthi Haasan : శృతి హాసన్‌కి కరోనా పాజిటివ్

Shruthi

Updated On : February 27, 2022 / 2:18 PM IST

Shruthi Haasan :  గత కొద్దీ రోజుల క్రితం కరోనా థర్డ్ వేవ్ అంటూ సెలబ్రిటీలందరికి కరోనా సోకింది. టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా అన్ని సినీ పరిశ్రమలలో స్టార్లకి కరోనా సోకింది. కరోనాతో కొంతమంది సెలబ్రిటీలు మరణించారు కూడా. చాలా మంది కరోనా నుంచి కోలుకొని తిరిగి తమ |పనులు మొదలు పెట్టారు. ఇప్పుడిప్పుడే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. అంతలోనే ఇవాళ మరో హీరోయిన్ కరోనా వచ్చింది అంటూ పరిశ్రమకి షాకిచ్చింది.

 

కమల హాసన్ కూతురు, హీరోయిన్ శ్రుతి హాసన్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ”హాయ్‌ ఎవర్రీవన్‌. ఇది సరదా అప్‌డేట్‌ కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అయినా కరోనా వచ్చింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వచ్చేందుకు ఎదురుచూస్తున్నాను” అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్‌ చేసింది శృతి హాసన్.

Bheemla Naik : ఏపీ సర్కార్‌‌పై ప్రకాశ్ రాజ్ హాట్ కామెంట్స్, బాక్సాపీస్ వద్ద కక్ష సాధింపులు ఏంటీ ?

కొన్ని నెలల క్రితం కమల్ హాసన్ కి కూడా కరోనా సోకి తగ్గింది. శృతి హాసన్ ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి NBK 107 సినిమాలో చేస్తుంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ మొదలయింది. శృతికి కరోనా సోకడంతో ఈ సినిమా షూట్ వాయిదా పడే ఛాన్సులు ఉన్నాయి.