Akash Ambani Car : ఆకాశ్ అంబానీ చక్కర్లుకొట్టే ఈ కారు ధర ఎంతో తెలుసా..?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు, భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన జియోకి చైర్మన్ ఆకాశ్ అంబానీ ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టే ఓ లావిష్ కారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Akash Ambani Car : అంబానీ కుటుంబం ఏం చేసినా అది ఓ రేంజ్ లో ఉంటుంది. వారు ఉపయోగించే అన్నీ వారి స్థాయికి తగినట్లే ఉంటాయి. ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో అంబానీ వారి స్థానం ఏమాత్రం తగ్గదు. అటువంటి అంబానీ వారసుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు, భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన జియోకి చైర్మన్ ఆకాశ్ అంబానీ ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టే ఓ కారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నో లగ్జరీ కార్లు అంబానీ కుటుంబం సొంతం. ఆకాశ్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లతో పాటు వరల్డ్‌లోనే లావిష్ కార్లున్నాయి. తానే స్వయంగా డైవ్ చేస్తూ ఆ లావిష్ కార్లలో దూసుకుపోవటమంటే ఆకాశ్ కు చాలా చాలా ఇష్టం. ఖరీదైన కారుతో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతుంటాడీ ముఖేశ్ అంబానీ కుమారుడు.. ఖరీదైన, స్పోర్ట్స్ కార్లను డ్రైవ్ చేస్తూ తరచుగా ముంబై వీధుల్లో తళుక్కుమంటుంటాడు ఆకాశ్.
Mukesh Ambani : అంబానీ కోడలా మజాకా? ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా?
అటువంటి ఆకాశ్ అంబానీ కళ్లు తిప్పుకోలేనంత రాజసం ఉట్టిపడే కారులో చక్కర్లు కొడుతున్నాడు. ఎర్రటి ఫెరారీ కారులో ఆకాశ్ ముంబై మహానగరం వీధుల్లో దూసుకుపోతుంటే చూసేవారంతా వారెవ్వా ఏముందిరా కారు అని అనుకోకుండా ఉండలేకపోతున్నారు. ఖరీదైన కార్ల ప్రేమికుడైన ఆకాశ్‌కు ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లను సొంతం చేసుకోవడమే కాదు ముంబై వీధుల్లో డ్రైవింగ్ థ్రిల్ అనుభవించడం కూడా అతనికి చాలా చాలా ఇష్టం.
దీంట్లో భాగంగానే ఎరుపు రంగు ఫెరారీ కారులో హల్చల్ చేయడంలో ఫ్యాన్స్ దృష్టిలో పడింది. ఆకాష్ అంబానీ తన డ్రైవింగ్ నైపుణ్యంతో ఫెరారీ SF90ని పరుగులు పెట్టించడం చూసినవారంతా ఆ కారు అందానికి ఫిదా అయిపోతున్నారు. ఇన్‌స్టాలో ఆకాశ్ అంబానీ ఫ్యాన్ పేజీ రెడ్ ఫెరారీ SF90ని నడుపుతున్న వీడియోను షేర్ చేసింది. ఫ్రంట్ సీట్ లో కూర్చుని వైట్ కలర్ టీ షర్ట్ లో దర్జాగా కనిపించాడు.దటీజ్ అంబానీ వారసుడు అనేలా లావిష్ లుక్ తో అద్దరగొడుతున్నాడు.
Mukesh Ambani: ఉద్యోగికి ముకేశ్ అంబానీ అదిరిపోయే గిఫ్ట్.. బాబోయ్.. ఏకంగా 1500కోట్లు ఇచ్చేశాడు..
ఇదిలా ఉంటే ఈ కారు ధర వింటే సామాన్యులేకాదు శ్రీమంతులు కూడా నోరెళ్లబెట్టాల్సిందే. ఈ ఎర్రటి ఫెరారీ SF90 ధర రూ. 7.50 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటి ఇది. దీని ధర రూ.7.50 కోట్లు..నివేదికల ప్రకారం ‘ప్రాన్సింగ్ హార్స్’ లోగో ఉన్న ఈ కారును భారతదేశంలో కేవలం ఇద్దరికి మాత్రమే ఈ కారు ఉంది. 7.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉన్న ఈకారుకు ఇది కారుకు 26 km (16 mi) అందిస్తుంది. ఇటీవల ఎల్లో కలర్ మెక్లారెన్ కారులో ఆకాశ్ అంబానీ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆకాశ్ అంబానీ భార్య శ్లోకా మెహతా. వీరికి పృథ్వీ అంబానీ అనే కుమారుడు ఉన్నాడు.
View this post on Instagram