Mukesh Ambani: ఉద్యోగికి ముకేశ్ అంబానీ అదిరిపోయే గిఫ్ట్.. బాబోయ్.. ఏకంగా 1500కోట్లు ఇచ్చేశాడు..

ముంబైలోని ప్రిమియం లొకాలిటీలోని నేపియన్ సీ రోడ్డులో ఉన్న 22 అంతస్తుల భవనాన్ని ముకేశ్ అంబానీ తన స్నేహితుడు మనోజ్ మోదీకి ఇచ్చాడు.

Mukesh Ambani: ఉద్యోగికి ముకేశ్ అంబానీ అదిరిపోయే గిఫ్ట్.. బాబోయ్.. ఏకంగా 1500కోట్లు ఇచ్చేశాడు..

Mukesh Ambani

Mukesh Ambani: భారతదేశ అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన సంస్థలో పనిచేసే ఉద్యోగికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. సాధారనంగా ముఖేశ్ అంబానీ తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల పట్ల ఔధార్యంగా ఉంటారని పేరుంది. అయితే, ప్రస్తుతం ముకేశ్ అంబానీ తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగికి ఇచ్చిన గిఫ్ట్ విలువ చూస్తే ఎవరికైనా దిమ్మతిరిగిపోవాల్సిందే. యాజమానులు ఇలాకూడా ఉంటారా? అనుకుంటూ నోరెళ్లబెట్టాల్సిందే. ఇంతకీ, ముఖేశ్ అంబానీ ఇచ్చిన గిఫ్ట్ విలువ ఎంతో తెలుసా? ఏకంగా రూ. 1500 కోట్లు.

Mukesh Ambani : అంబానీ కోడలా మజాకా? ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా?

అతి ఖరీదైన, లగ్జరీ బంగ్లాను ముఖేశ్ తన ఉద్యోగికి ఇచ్చేశాడు. అయితే, ఆ గిఫ్ట్ అందుకున్న ఉద్యోగి పేరు మనోజ్ మోదీ. అతను సాధారణ వ్యక్తి కాదు. ముకేశ్ అంబానీ రైట్‌హ్యాడ్‌గా చెప్పుకుంటారు. ముకేశ్ అంబానీ ముంబై యూనివర్సిటీలో కెమికల్ టెక్నాలజీ చదువుతున్న సమయంలో తన క్లాస్ మెంట్, ఫ్రెండే మనోజ్ మోదీ. అప్పటి నుంచి వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. 1980 దశకంలో నుంచే మనోజ్ మోదీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పనిచేస్తున్నారు. ఆ సమయంలో కంపెనీ నిర్వహణ బాధ్యతలను ముకేశ్ అంబానీ తండ్రి ధీరూభాయి చూస్తున్నారు. మనోజ్ మోదీకి ఉద్యోగం ఇవ్వాలని అంబాని తన తండ్రిని కోరడంతో అప్పటినుంచి మోదీ రియల్స్ ఇండస్ట్రీస్‌లో ఉద్యొగిగా మారిపోయాడు. అప్పటి నుంచి నేటి వరకు మనోజ్ మోదీ ఆ కంపెనీలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో‌ల్లో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

Mukesh Ambani: ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీని దాటేసిన అంబానీ.. టాప్-10లో నిలిచిన ముకేష్ అంబానీ

ముంబైలోని ప్రిమియం లొకాలిటీలో ఉన్న నేపియన్ సీ రోడ్డులోని 22 అంతస్తుల భవనాన్ని ముకేశ్ అంబానీ తన స్నేహితుడు మనోజ్ మోదీకి ఇచ్చాడు. ఈ భవనంలోని ఫర్నిచర్ ను ఇటలీ నుంచి తెప్పించారు. మనోజ్ మోదీ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటారు. అయితే, రిలయన్స్‌కు భారీ ప్రాజెక్టులు దక్కడంలో మనోజ్ మోదీ పాత్ర కూడా కీలకమని రిలయన్స్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగానే సహాయం గుణం కలిగిన ముకేశ్ కుటుంబం.. ఇప్పుడు మనోజ్ మోదీకి రూ.1500 కోట్ల గిఫ్ట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.