Mukesh Ambani: ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీని దాటేసిన అంబానీ.. టాప్-10లో నిలిచిన ముకేష్ అంబానీ

ముకేష్ అంబానీ అత్యంత భారతీయ సంపన్నుడిగా మారారు. టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు కూడా అంబానీనే. గతంలో ఈ జాబితాలో టాప్-2 ప్లేసులో ఉన్న అదానీ సంపద ఇటీవల భారీగా తరిగిపోయిన సంగతి తెలిసిందే. అదానీ 28 బిలియన్ డాలర్లు కోల్పోయి, 53 బిలియన్ డాలర్ల సంపద మాత్రమే కలిగి ఉన్నాడు.

Mukesh Ambani: ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీని దాటేసిన అంబానీ.. టాప్-10లో నిలిచిన ముకేష్ అంబానీ

Mukesh Ambani: ప్రపంచ సంపన్నుల జాబితాలో ముకేష్ అంబానీ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో గౌతమ్ అదానీని వెనక్కునెట్టి, ముకేష్ టాప్-10లోకి దూసుకెళ్లారు. ఎం3ఎం హురున్ సంస్థ ప్రకటించిన తాజాగా ప్రపంచ సంపన్నుల జాబితా ప్రకటించింది.

NTR 30 : భారీగా NTR30 ఓపెనింగ్.. రాజమౌళి, ప్రశాంత్ నీల్.. అనేక మంది సినీ ప్రముఖుల సమక్షంలో..

హురున్ ఇండియా, ఎం3ఎం ఇండియా కలిపి ఈ జాబితాను రూపొందించాయి. దీని ప్రకారం ఈ ఏడాది జనవరి 14 నాటికి అదానీ 82 బిలియన్ డాలర్లతో టాప్-10లో నిలిచారు. దీంతో అత్యంత భారతీయ సంపన్నుడిగా మారారు. టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు కూడా అంబానీనే. గతంలో ఈ జాబితాలో టాప్-2 ప్లేసులో ఉన్న అదానీ సంపద ఇటీవల భారీగా తరిగిపోయిన సంగతి తెలిసిందే. అదానీ 28 బిలియన్ డాలర్లు కోల్పోయి, 53 బిలియన్ డాలర్ల సంపద మాత్రమే కలిగి ఉన్నాడు. హిడెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో గత ఏడాది అదానీ సంపద 35 శాతం తగ్గిపోయింది. గతంలో అదానీ నిలిచిన రెండో స్థానాన్ని ఈ సారి ఆసియాకే చెందిన జోంగ్ షాన్షన్ దక్కించుకున్నారు.

London: లండన్‌లో భారత రాయబార కార్యాలయంపై భారీ మూడు రంగుల జెండా.. వీడియో వైరల్

భారతీయ సంపన్నుల్లో అంబానీ మొదటి స్థానంలో, అదానీ రెండో స్థానంలో ఉండగా, సైరస్ పూనావాల 27 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, శివ నాడార్ 26 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో, లక్ష్మీ మిట్టల్ 20 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు. హురున్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య తగ్గింది. 269 మంది బిలియనీర్లు ఈ జాబితాలో చోటు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం 3112 మంది బిలియనీర్లు ఉన్నారు.