London: లండన్‌లో భారత రాయబార కార్యాలయంపై భారీ మూడు రంగుల జెండా.. వీడియో వైరల్
పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ సింగ్ కోసం వేట ప్రారంభించడానికి నిరసగా, బ్రిటన్‌లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కార్యాలయంపై ఉన్న భారత జాతీయ జెండాను తొలగించారు. అక్కడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

London: ఖలిస్తాన్ మద్దతుదారులకు ధీటుగా భారతీయులు కూడా స్పందించారు. లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై భారీ మూడు రంగుల భారతీయ జెండాను ఎగురవేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Building Collapsed : విశాఖ రామజోగిపేటలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ సింగ్ కోసం వేట ప్రారంభించడానికి నిరసగా, బ్రిటన్‌లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కార్యాలయంపై ఉన్న భారత జాతీయ జెండాను తొలగించారు. అక్కడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పైగా ఆ సమయంలో అక్కడి ప్రభుత్వం పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేయలేదు. బారికేడ్లను కూడా తొలగించింది. అయితే, ఈ చర్యపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియాలోని బ్రిటన్ రాయబారికి నోటీసులు జారీ చేసింది. కాగా, లండన్‌లోని భారతీయులు ఈ విషయంపై స్పందించారు. ఖలిస్తాన్ మద్దతుదారుల చర్యలకు నిరసనగా, ప్రతిచర్యకు దిగారు.
లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై అతిపెద్ద భారత జాతీయ జెండాను ఎగురవేశారు. భారత్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం రాయబార కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సెక్యూరిటీని పెంచింది. బారికేడ్లు కూడా ఏర్పాటు చేసింది. అయితే, ఖలిస్తాన్ మద్దతుదారులు తిరిగి నిరసన చేపట్టారు. ఖలిస్తాన్‌కు, అమృత్‌పాల్ సింగ్‌కు మద్దతుగా ఖలిస్తాన్ జెండాలతో నినాదాలు చేపట్టారు. అడ్డుకున్న పోలీసులపై ఇంక్ చల్లారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | A giant Tricolour put up by the Indian High Commission team atop the High Commission building in London, UK. pic.twitter.com/YClmrfs00u
— ANI (@ANI) March 22, 2023