Das Ka Dhamki : దాస్ కా ధమ్కీ.. పాత కథ, అన్ని తెలిసిన ట్విస్టులే.. కానీ సరికొత్త స్క్రీన్ ప్లేతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్..

విశ్వక్ సేన్(Vishwaksen), నివేతా పేతురాజ్(Nivetha Pethuraj) జంటగా విశ్వక్ సొంత నిర్మాణ, దర్శకత్వంలో వచ్చిన సినిమా దాస్ కా ధమ్కీ(Das Ka Dhamki). ఉగాది(Ugadi) పండుగ నాడు ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు విశ్వక్. ముందు నుంచి ఈ సినిమాపై....................

Das Ka Dhamki : దాస్ కా ధమ్కీ.. పాత కథ, అన్ని తెలిసిన ట్విస్టులే.. కానీ సరికొత్త స్క్రీన్ ప్లేతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్..

Vishwaksen Das Ka Dhamki movie review cinema gets good response

Das Ka Dhamki :  విశ్వక్ సేన్(Vishwaksen), నివేతా పేతురాజ్(Nivetha Pethuraj) జంటగా విశ్వక్ సొంత నిర్మాణ, దర్శకత్వంలో వచ్చిన సినిమా దాస్ కా ధమ్కీ(Das Ka Dhamki). ఉగాది(Ugadi) పండుగ నాడు ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు విశ్వక్. ముందు నుంచి ఈ సినిమాపై భారీ హైప్స్ పెంచేసి, భారీగా ప్రమోట్ చేసి అంచనాలు పెట్టాడు విశ్వక్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్(NTR) ని తీసుకొచ్చి ఎన్టీఆర్ అభిమానిని అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కూడా సినిమాకు రప్పించుకునేలా చేశాడు. సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చి మంచి విజయం సాధించింది.

కథ విషయానికి వస్తే గతంలో పాత సినిమాల్లో ఇలాంటివి చాలా కథలు వచ్చాయి. ఇటీవల కూడా ఈ కథలతో సినిమాలు వచ్చాయి. హీరో, విలన్ ఒకేలా ఉండటంతో విలన్ హీరోని తన ప్లేస్ లో ఇరికించి తాను డబ్బుతో ఎస్కెప్ అయిపోవడం, తప్పించుకోవడం లాంటివి చాలా సినిమాల్లో చూశాము. ఈ సినిమా కథ కూడా అదే. కాకపోతే దాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా చెప్పాడు విశ్వక్. ఒక స్టార్ హోటల్ లో వెయిటర్ గా పనిచేసే మాములు మనిషిని తనలాగే ఉండే విలన్, అతని మనుషులు అతన్ని ట్రాప్ చేసి విలన్ చేసే తప్పుకు ఇరికిద్దాం అనుకుంటే హీరో ఎలా తప్పించుకున్నాడు, వాళ్లకి ఎలా బుద్ది చెప్పాడు అనేదే కథ.

మొదటి హాఫ్ మొత్తం హీరోయిన్ తో ప్రేమ, సాంగ్స్, కామెడీలతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ అంతా ఒక్కో ట్విస్ట్ ని రివీల్ చేస్తూ వెళ్తారు. అయితే ఇందులో చాలా వరకు ట్విస్టులు రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ళు, సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్లకు తెలిసిపోతుంది. కాకపోతే ఆ ట్విస్టులని స్క్రీన్ ప్లేలో సరికొత్తగా ప్రజెంట్ చేశాడు విశ్వక్. సినిమాలో మెయిన్ ప్లస్ విశ్వక్ సేన్. మంచి వాడిగా, నెగిటివ్ షేడ్స్ లో పర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. విశ్వక్ యాక్టింగ్ లో తన బెస్ట్ ఇచ్చాడు. ఇక అతడే నిర్మాణం, దర్శకత్వం కాబట్టి అందులో కూడా ఎక్కడా తగ్గకుండా సినిమా రిచ్ లుక్ లో బాగా తీశాడు.

Ugadi : ఉగాది అప్డేట్స్, స్పెషల్ పోస్టర్స్ తో కళకళలాడిన టాలీవుడ్..

హీరోయిన్ నివేతా పేతురాజ్ తన అందాల డోసు ఇంకొంచెం పెంచింది ఈ సినిమాలో. సీనియర్ నటి రోహిణి సినిమా అంతా వీల్ చైర్ లోనే ఉండి క్లైమాక్స్ లో ఒకే ఒక్క డైలాగ్ ఉన్నా పక్షవాతం వచ్చిన అమ్మలా బాగా నటించింది. రావు రమేష్, హైపర్ ఆది, మహేష్, అజయ్.. అందరూ కూడా మెప్పించారు. సినిమాకి మ్యూజిక్, పాటలు, బ్యాక్ గ్రౌండ్ చాలా ప్లస్ అయ్యాయి. సినిమా రిలీజ్ కి ముందే పాటలు మంచి హిట్ అవ్వడంతో సినిమాకు మరింత ప్లస్ అయింది. కథ, ట్విస్టులు ఎలా ఉన్నా కథని సరికొత్తగా చెప్పడంలో మరోసారి విశ్వక్ సక్సెస్ అయ్యాడు. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. మరోసారి హిట్ కొట్టేసాడు అంటున్నారు ప్రేక్షకులు. మరి విశ్వక్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ తెస్తుందో చూడాలి. ఇక చివర్లో ధమ్కీ 2 అని ఇచ్చి మరింత ఆసక్తి కలిగించాడు ప్రేక్షకుల్లో.

 

*ఇది కేవలం మా వ్యక్తిగత అభిప్రాయం..