Building Collapsed : విశాఖ రామజోగిపేటలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

విశాఖలో అర్ధరాత్రి విషాదం నెలకొంది. రామజోగిపేటలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

Building Collapsed : విశాఖ రామజోగిపేటలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

building collapsed

Updated On : March 23, 2023 / 11:14 AM IST

Building Collapsed : విశాఖలో అర్ధరాత్రి విషాదం నెలకొంది. రామజోగిపేటలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదు మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెళ్లెల్లున్నారు. శిథిలాల కింద చిన్నారి మృతదేహం లభ్యమైంది.

దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి శిథిలాల కింద ఉన్న మూడు మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన వారిని సాకేటి అంజలి(15), దుర్గప్రసాద్(18), బీహార్ కు చెందిన చోటు(26)గా గుర్తించారు. మరోవైపు గాయపడిన వారిని చికిత్స కోసం విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Video: ఢిల్లీలో భయానక ఘటన.. ఒక్కసారిగా కుప్పకూలిన భవనం

సమాచారం అందుకున్న ఆర్డీవో హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. అటు డీసీపీ గరుడ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పురాతన భవనం తడిసింది.

రెండు రోజులపాటు కురిసిన వర్షానికి భవనం తడవడంతోనే కూలినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు మృతురాలు చిన్నారి అంజలీ నిన్ననే (బుధవారం) పుట్టినరోజు జరుపుకున్నారు. పుట్టిన రోజు జరుపున్న మరుసటి రోజే చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. భవనం కూలిపోయే సమయంలో అందులో ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది.

TN Rains : తమిళనాడులో కుప్పకూలిన భవనం..ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

మరోవైపు ఈ ఘటనపై జీవీఎంసీ విచారణకు ఆదేశించింది. కాలమ్స్ లేకుండా మూడు ఫ్లోర్లు వేయడం వల్ల దుర్ఘటన జరిగిందని జీవీఎంసీ కమిషనర్ రాజబాబు తెలిపారు. భవనం 40 ఏళ్ల క్రితం నాటిదని పేర్కొన్నారు.