TN Rains : తమిళనాడులో కుప్పకూలిన భవనం..ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

తమిళనాడులో ఓ భవనం కుప్పకూలింది. ఇటీవల కురుస్తున్న వార్షాలకు భవనం కూలిపోవటంతో ..ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందిన ఘటన వేలూరులో చోటుచేసుకుంది.

TN Rains : తమిళనాడులో కుప్పకూలిన భవనం..ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

Tn Rains

TN rains : భారీగా కురుస్తున్న వర్షాలకు పలు భవంతులు కూడా కప్పకూలిపోతున్నాయి. ఈక్రమంలో తమిళనాడులోని వేలూరు పెన్నంబుల్ లో ఓ భవనం కుప్పకూలి ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిదిమంది మృతి చెందారు. శుక్రవారం (నవంబర్ 19,2021) తెల్లవారుఝామున భవనం గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా మారో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ప్రాథమిక విచారణలో మృతుల పేర్లు మిస్బా ఫాతిమా, అనీసా బేగం, రూహి నాజ్, కౌసర్, తంజీలా, అఫీరా, మన్నులా, తామెడ్ మరియు అఫ్రాగా తేలింది.గాయపడిన వ్యక్తులు గుడియాతం ప్రభుత్వ ఆసుపత్రి మరియు అడుక్కంపరైలోని ప్రభుత్వ వెల్లూరు మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) S ధనంజేయన్ మాట్లాడుతూ.. “పెర్నాంబుట్ టౌన్‌లో ఉన్న ఓ భవనం ఉదయం 6.30 గంటలకు కుప్పకూలిపోయింది. వరదనీరు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ (TNFRS) సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. కూలిన భవన శిథిలాల నుంచి తొమ్మిది మందిని సురక్షితంగా కాపాడారు.

వారికి గాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ పి. కుమారవేల్ పాండియన్ పరిస్థితిని పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల గురించి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు పట్ల సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50వేలు అందజేస్తామని ప్రకటించారు.