Video: ఢిల్లీలో భయానక ఘటన.. ఒక్కసారిగా కుప్పకూలిన భవనం

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. నగరంలోని బంజారపుర ప్రాంతంలో విజయ పార్క్ సమీపంలో ఉన్న ఒక భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Video: ఢిల్లీలో భయానక ఘటన.. ఒక్కసారిగా కుప్పకూలిన భవనం

A building collapsed in Delhi

Updated On : March 8, 2023 / 8:27 PM IST

Video: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. నగరంలోని బంజారపుర ప్రాంతంలో విజయ పార్క్ సమీపంలో ఉన్న ఒక భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా ఏమైనా జరిగిందా అనే విషయం ఇంకా తెలియలేదు. అలాగే భవనం కుప్పకూలడానికి గల కారణం కూడా తెలియదు. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాక విషయం ఏంటనేది తెలుస్తుందని అంటున్నారు.