Akhanda : ‘అఖండ’ కోసం అదిరిపోయే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ఇతనే..

ఈ సినిమాలో బాలకృష్ణ మేకోవర్ పరంగా చాలా చేంజ్ అయ్యారు. రైతుగా, అఘోరగా రెండు పాత్రల్లో డిఫరెన్స్ చూపించారు. ఇందులో ముఖ్యంగా అఘోరాగా బాలకృష్ణ గెటప్ హైలెట్.....

Akhanda : ‘అఖండ’ కోసం అదిరిపోయే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ఇతనే..

Raamz (1)

Akhanda :  నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా `అఖండ` భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 100 కోట్ల కలెక్షన్స్ వైపుకి కూడా దూసుకుపోతుంది ఈ సినిమా. ఈ సినిమా అంచనాలకు మించి సంచలనం సృష్టించింది. దేశ విదేశాల్లోనూ ‘అఖండ’ మానియా కనిపించింది. సినిమా రిలీజ్ అయి ఇంకా 10 రోజులు అవుతున్నా ఇప్పటికీ థియేటర్స్ లో జనాలు ఫుల్ గానే కనిపిస్తున్నారు అంటే ‘అఖండ’ ఏ రేంజ్ లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

Shimbu : హాస్పిటల్ లో శింబు.. ఆందోళనలో అభిమానులు..\

ఈ సినిమాలో బాలకృష్ణ మేకోవర్ పరంగా చాలా చేంజ్ అయ్యారు. రైతుగా, అఘోరగా రెండు పాత్రల్లో డిఫరెన్స్ చూపించారు. ఇందులో ముఖ్యంగా అఘోరాగా బాలకృష్ణ గెటప్ హైలెట్ అయింది. ఆ డ్రెస్ కానీ, బాలకృష్ణ మేకోవర్ కానీ బాగా ప్లస్ అయ్యాయి సినిమాకి. అయితే ఈ ఆలోచన బోయపాటిది అయినా ఆచరణలో పెట్టింది మాత్రం స్టైలిస్ట్, ఫ్యాషన్ డిజైనర్ రామ్జ్. అఖండ సినిమాలోని రెండు పాత్రలకి ఇతనే కాస్ట్యూమ్స్, మేకోవర్, చెప్పులు, షూస్ ఇవన్నీ డిజైన్ చేసింది ఇతనే. రామ్జ్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్.

Bigg Boss 5 : సిరి కోసం ప్రియుడి ప్రమోషన్స్.. తన కష్టాలు మీకు తెలీవు.. సపోర్ట్ చేయండి..

రామ్ హీరోగా చేసిన ‘జగడం’ సినిమాలో హీరో కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేసాడు రామ్జ్. ఆ తర్వాత ఇండస్ట్రీలోనే ఫ్యాషన్ డిజైనర్ గా, స్టైలిస్ట్ గా, మేకోవర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ, రానా, నాగార్జున, రజనీకాంత్ సినిమాలకి కూడా రామ్జ్ వర్క్ చేశాడు. అయితే ఇన్నేళ్లుగా రాని గుర్తింపు `అఖండ`తో లభించిందని రామ్జ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Rajanikanth : ‘పెద్దన్న’ మూవీ డైరెక్టర్ కి సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్ ఇచ్చిన రజినీకాంత్

బాలకృష్ణని ‘అఖండ’గా మార్చిన క్రెడిట్ ఇతనిదే. ‘అఖండ’ పాత్ర వేసే బ్లాక్ డ్రెస్, పైన ధరించే కాశాయ వస్త్రం, మెడలో వేసుకునే రుద్రాక్ష మాలలు, లెదర్ చెప్పులు, చేతులపై టాటూలు, త్రిశూలం.. ఇవన్నీ రామ్జ్ డిజైన్ చేశాడు. ఇవే అఖండ పాత్రని బాగా ఎలివేట్ చేసాయి. ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పని చేస్తున్నా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రామ్జ్.