Rajanikanth : ‘పెద్దన్న’ మూవీ డైరెక్టర్ కి సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్ ఇచ్చిన రజినీకాంత్

సినిమా భారీ విజయం సాధించినందుకు ర‌జ‌నీ హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. దీంతో నిన్న ఈ సినిమా డైరెక్టర్ శివ ఇంటికి వెళ్లి ఆయనను, అతడి కుటుంబ స‌భ్యుల‌ను పలకరించాడు. రజినీకాంత్ స్వయంగా శివ....

Rajanikanth : ‘పెద్దన్న’ మూవీ డైరెక్టర్ కి సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్ ఇచ్చిన రజినీకాంత్

Rajinikanth

Rajanikanth :  సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు ‘అన్నాత్తై’ సినిమా వచ్చింది. తెలుగులో ఈ సినిమా ‘పెద్దన్న’గా రిలీజ్ అయింది. సెంటిమెంట్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా వచ్చిన ఈ సినిమా తెలుగులో యావరేజ్ గా నిలిచినా, త‌మిళంలో భారీ హిట్ అయి దాదాపు 200 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ ఓటిటిలో కూడా విడుదలై ‘అన్నాత్తై’ అక్కడ కూడా మంచి విజయం సాధించింది.

Bigg Boss 5 : బిగ్‌‍బాస్ లో హిట్ స్టార్.. ప్లాప్ స్టార్ ఎవరు??

ఈ సినిమా భారీ విజయం సాధించినందుకు ర‌జ‌నీ హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. దీంతో నిన్న ఈ సినిమా డైరెక్టర్ శివ ఇంటికి వెళ్లి ఆయనను, అతడి కుటుంబ స‌భ్యుల‌ను పలకరించాడు. రజినీకాంత్ స్వయంగా శివ ఇంటికి వెళ్లి పలకరించడంతో కోలీవుడ్‌లో ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. డైరెక్టర్‌ శివ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో మూడు గంటల పాటు ముచ్చటించాడట. అంతేగాక డైరెక్టర్ శివకు ఓ బంగారు చెయిన్‌ను సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్ గా ఇచ్చాడని సమాచారం.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రొమాన్స్ లేదు.. ఓన్లీ బ్రోమాన్స్ మాత్రమే : రాజమౌళి

రజనీ సడెన్‌గా శివ ఇంటికి వెళ్లి వాళ్ళతో టైం స్పెండ్ చేసి, గోల్డ్ చైన్ బహుమతి ఇవ్వడంతో డైరెక్టర్‌ శివ, అతడి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.