Bigg Boss 5 : బిగ్‌‍బాస్ లో హిట్ స్టార్.. ప్లాప్ స్టార్ ఎవరు??

నిన్నటి ఎపిసోడ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు హిట్ స్టార్? ఎవరు ప్లాప్ స్టార్ చెప్పాలి అనే టాస్క్ ఇచ్చారు. అయితే ఇది చెప్పే ముందు కంటెస్టెంట్స్ 14 వారాల ఆటని పరిగణలోకి.......

Bigg Boss 5 : బిగ్‌‍బాస్ లో హిట్ స్టార్.. ప్లాప్ స్టార్ ఎవరు??

Bb

Bigg Boss 5 :  బిగ్ బాస్ ఇక ఆఖరి దశకి రావడంతో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎపిసోడ్స్ ని చూస్తున్నారు. ఎవరు విన్ అవుతారు? ఎవరు టాప్ 5లో ఉంటారు అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చివరి దశలో ఉండటంతో బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కూడా ఆసక్తికరంగా మారాయి. తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు హిట్ స్టార్? ఎవరు ప్లాప్ స్టార్ చెప్పాలి అనే టాస్క్ ఇచ్చారు. అయితే ఇది చెప్పే ముందు కంటెస్టెంట్స్ 14 వారాల ఆటని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. హిట్, ప్లాప్ ట్యాగ్స్ ని తీసుకొని వాళ్లకి అంటించాలని చెప్పారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రొమాన్స్ లేదు.. ఓన్లీ బ్రోమాన్స్ మాత్రమే : రాజమౌళి

ఈ టాస్క్ లో ముందుగా కాజల్‌.. సన్నీకి హిట్‌ స్టార్‌, షణ్నుకి ఫ్లాప్‌ స్టార్‌ అన్న ట్యాగ్స్ అంటించింది.

శ్రీరామ్‌.. సన్నికి హిట్‌, కాజల్‌కు ఫ్లాప్‌ స్టార్‌ ట్యాగ్స్ ని అంటించాడు.

సన్నీ.. మానస్‌కు హిట్‌, సిరికి ఫ్లాప్‌ స్టార్‌ అన్న ట్యాగ్‌ని ఇచ్చాడు.

తర్వాత సిరి.. షణ్నుకి హిట్‌, సన్నీకి ఫ్లాప్‌ స్టార్‌ ట్యాగ్స్ ని అంటించింది.

మానస్‌.. సన్నీకి హిట్‌, షణ్నుకు ఫ్లాప్‌ స్టార్‌ ట్యాగ్‌ ఇచ్చాడు.

చివర్లో షణ్ముఖ్‌.. సిరికి హిట్‌, కాజల్‌కు ఫ్లాప్‌ స్టార్‌ ట్యాగ్స్ ఇచ్చాడు.

pushpa : ‘పుష్ప’ హిందీ వర్షన్‌లో అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పింది ఇతనే

ఇవన్నీ చూశాక అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ కి హిట్ ఇచ్చుకొని వాళ్ళకి నచ్చని వాళ్లకి ప్లాప్ ఇచ్చారని, గేమ్ ని పరిగణలోకి తీసుకోలేదని ప్రేక్షకులు అంటున్నారు.