pushpa : ‘పుష్ప’ హిందీ వర్షన్‌లో అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పింది ఇతనే

ఈ సినిమా హిందీ వర్షన్ లో అల్లు అర్జున్ పాత్రకి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా డబ్బింగ్ చెప్పిన నటుడే వెల్లడించాడు. భారతదేశపు పవర్‌ఫుల్‌, స్టైలిష్‌ స్టార్‌..

pushpa : ‘పుష్ప’ హిందీ వర్షన్‌లో అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పింది ఇతనే

Pushpa

pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్స్ గా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. సుకుమార్ బన్నీ కలయికలో వస్తున్న మూడో చిత్రం ఇది. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. తెలుగు, తమిళ్,మలయాళం, కన్నడతో పాటు హిందీలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ‘పుష్ప’ సినిమాని డిసెంబర్‌ 17న రిలీజ్ చేయనున్నారని ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

Manchu Lakshmi : కేరళ ప్రాచీన విద్యతో అదరగొడుతున్న మంచు లక్ష్మి… వైరల్ అవుతున్న వీడియోలు

అయితే ఈ సినిమా హిందీ వర్షన్ లో అల్లు అర్జున్ పాత్రకి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా డబ్బింగ్ చెప్పిన నటుడే వెల్లడించాడు. ‘రేవతి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ‘ఓం శాంతి ఓం’ సినిమాతో పేరు తెచ్చుకున్న శ్రేయాస్‌ తల్పడే ‘పుష్ప’ హిందీ వర్షన్ లో అల్లు అర్జున్ కి డబ్బింగ్ చెప్పాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేశాడు.

Bigg Boss 5 : దిమ్మ దిరిగే ప్రశ్న అడిగిన ప్రేక్షకుడు.. షాక్ అయిన కాజల్

ట్విట్టర్ లో ఈ విషయాన్ని షేర్ చేస్తూ.. భారతదేశపు పవర్‌ఫుల్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ నటించిన ‘పుష్ప’ హిందీ వర్షెన్‌కు అల్లు అర్జున్ పాత్రకి వాయిస్‌ ఇచ్చాను. చాలా గర్వంగా, సంతోషంగా ఉంది అంటూ ట్వీట్‌ చేశాడు శ్రేయాస్. ఇతను నటుడిగా దాదాపు 30 సినిమాలకు పైగానే నటించాడు. అంతే కాక డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు శ్రేయాస్ తల్పడే. హిందీ ‘పుష్ప’ ట్రైలర్ లో శ్రేయాస్ వాయిస్ విని బాగుంది అని మన తెలుగు అభిమానులు మెచ్చుకుంటున్నారు.