Manchu Lakshmi : కేరళ ప్రాచీన విద్యతో అదరగొడుతున్న మంచు లక్ష్మి… వైరల్ అవుతున్న వీడియోలు

మంచులక్ష్మీ కేరళ ప్రాచీన విద్య కలరిపయట్టు నేర్చుకుంటుంది. గత నాలుగు రోజుల నుంచి ఈ విద్యలో శిక్షణ తీసుకుంటుంది. శిక్షణ తీసుకుంటున్న ఫోటోలను, వీడియోలను తన సోషల్ మీడియా.......

Manchu Lakshmi : కేరళ ప్రాచీన విద్యతో అదరగొడుతున్న మంచు లక్ష్మి… వైరల్ అవుతున్న వీడియోలు

Manchu Lakshmi

Manchu Lakshmi :  మోహన్ బాబు కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి కొన్ని వైవిధ్యమైన సినిమాలతో అలరించింది. ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా మంచు లక్ష్మికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక మంచు లక్ష్మి ఎప్పుడూ కొత్త కొత్త విద్యలు ట్రై చేస్తూ ఉంటుంది. గతంలో ట్రెక్కింగ్, సైక్లింగ్, డ్యాన్స్, బాక్సింగ్, కరాటే, జుంబా డ్యాన్స్ లాంటివి నేర్చుకుంటూ వాటి ఫోటోలు వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఖాళీగా ఉండకుండా మంచు లక్ష్మి ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటుంది. తాజాగా మరో కొత్త విద్యను నేర్చుకుంటుంది.

Heroines : ఐటెం సాంగ్స్ చేసిన స్టార్ హీరోయిన్స్

మంచులక్ష్మీ కేరళ ప్రాచీన విద్య కలరిపయట్టు నేర్చుకుంటుంది. గత నాలుగు రోజుల నుంచి ఈ విద్యలో శిక్షణ తీసుకుంటుంది. శిక్షణ తీసుకుంటున్న ఫోటోలను, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తుంది మంచు లక్ష్మి. తాజాగా తాను కలరిపయట్టు పై శిక్షణ తీసుకుంటున్న వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఆ వీడియోని తన సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కొటేషన్స్ పెట్టింది.

DVV Danayya : ఏపీ సినిమా టికెట్ రేట్లతో నిర్మాతలకు వర్కవుట్ అవ్వదు : ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత దానయ్య

మంచు లక్ష్మి తన కలరిపయట్టు వీడియోని షేర్ చేస్తూ.. నేను ప్రతిరోజూ కలరిపయట్టు కోసం శిక్షణ పొందుతున్నప్పుడు నిప్పు, నీరు, భూమి, శ్వాస, చెమట మరియు జీవితపు నాడితో అనుసంధానం చేస్తున్నాను. కలరి శిక్షణతో మన శరీరాన్ని అర్థం చేసుకోవడం, పాజిటివ్ ఎనర్జీని సాధించడం చాలా సులభం అంటూ పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్ మంచు లక్ష్మి ఈ ఏజ్ లో విన్యాసాలు చేస్తుంది అంటే గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న ఆర్జీవీ కూడా మంచు లక్ష్మి కలరిపయట్టు వీడియోపై నువ్వు ఏదైనా చేయగలవు అంటూ కామెంట్స్ చేశాడు.