DVV Danayya : ఏపీ సినిమా టికెట్ రేట్లతో నిర్మాతలకు వర్కవుట్ అవ్వదు : ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత దానయ్య

తాజాగా ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ లో ఆ సినిమా నిర్మాత డివివి.దానయ్య ఈ అంశంపై మాట్లాడారు. ప్రెస్ మీట్ లో నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం సినిమాల విషయంలో తీసుకున్న......

DVV Danayya : ఏపీ సినిమా టికెట్ రేట్లతో నిర్మాతలకు వర్కవుట్ అవ్వదు : ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత దానయ్య

Dvv

DVV Danayya :  ఏపీలో సినీ పరిశ్రమ, థియేటర్స్ సమస్యలపై గత కొన్ని నెలలుగా చర్చలు నడిచాయి. సినీ పెద్దలు ఏపీ సీఎం, మంత్రులని కలిసి వారి సమస్యలని వినిపించారు. అయినా ఏపీ ప్రభుత్వం ఇటీవల సినీ నియంత్రణ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. ఈ బిల్లు సినీ పరిశ్రమకి, థియేటర్లకు నష్టాన్ని కలిగించేలా ఉందే తప్ప ఎవరికీ లాభం చేకూర్చేలా లేదు. ఈ బిల్లు ప్రవేశపెట్టిన విషయాన్ని మంత్రి పేర్ని నాని మీడియా ద్వారా తెలిపారు. ఇకపై బెనిఫిట్ షోలు, ఎక్సట్రా షోలు ఉండవని, టికెట్ రేట్లు భారీగా తగ్గించామని తెలిపారు.

Bigg Boss 5 : శ్రీదేవి పాత్రలో అలరించి బెస్ట్ పర్ఫార్మర్ గా కాజల్..

అయితే దీనిపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. చాలా వరకు సినీ పెద్దలు ఆన్లైన్ టికెటింగ్ ని స్వాగతించినా టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పటికే సురేష్ బాబు, సి.కళ్యాణ్ లాంటి కొంతమంది నిర్మాతలు కూడా ఈ బిల్లుని వ్యతిరేకించి మాట్లాడారు.

Bigg Boss 5 : దిమ్మ దిరిగే ప్రశ్న అడిగిన ప్రేక్షకుడు.. షాక్ అయిన కాజల్

తాజాగా ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ లో ఆ సినిమా నిర్మాత డివివి.దానయ్య ఈ అంశంపై మాట్లాడారు. ప్రెస్ మీట్ లో నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం సినిమాల విషయంలో తీసుకున్న నిర్ణయాలు సినీ పరిశ్రమకి నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఏపి గవర్నమెంట్ సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించారు. అది నిర్మాతలకు వర్క్ అవుట్ కాదు. పెద్ద సినిమాలకు ఆ టికెట్ రేట్లు ఉంటే పెట్టిన డబ్బులు కూడా రావు అని అన్నారు.

Samantha : ‘పుష్ప’ ఐటెం సాంగ్‌లో సమంత అదరగొట్టే స్టిల్స్

ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని కలిసి టిక్కెట్ రేట్ల పై చర్చలు జరుపుతున్నాం అని తెలిపారు. మళ్ళీ కలిసి సినిమా టికెట్స్ విషయం గురించి మరోసారి మాట్లాడతామని అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మాత్రమే కాదు పెద్ద సినిమాలన్నిటికీ టికెట్ రేట్లు పెంచుకునే వెసలుబాటు కలిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరతామన్నారు దానయ్య.