Bigg Boss 5 : శ్రీదేవి పాత్రలో అలరించి బెస్ట్ పర్ఫార్మర్ గా కాజల్..

ఈ టాస్క్ లో గెలిచి వాళ్లలో బెస్ట్ పర్ఫార్మర్ గా వచ్చిన వాళ్ళు ప్రేక్షకులని ఓట్లు అడగొచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. ఎవరు బాగా పర్ఫార్మ్ చేశారో అది కూడా కంటెస్టెంట్స్ నే డిసైడ్.....

Bigg Boss 5 : శ్రీదేవి పాత్రలో అలరించి బెస్ట్ పర్ఫార్మర్ గా కాజల్..

Kajal Bb

Bigg Boss 5 :  బిగ్ బాస్ చివరి దశకు రావడంతో రోజు రోజుకి టాస్కులతో, కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ లతో మరింత ఆసక్తిగా మారుతుంది. హౌస్ లో ఇప్పుడు ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ పోటీ పడి మరీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ని చూపిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ప్రేక్షకులను ఓట్లు అడగాలంటే సినిమా స్టార్లను అనుకరించే టాస్కు తో పాటు డ్యాన్స్ లు కూడా వెయ్యాలని చెప్పాడు బిగ్ బాస్.

Bigg Boss 5 : దిమ్మ దిరిగే ప్రశ్న అడిగిన ప్రేక్షకుడు.. షాక్ అయిన కాజల్

దీంతో కంటెస్టెంట్స్ అంతా స్టార్స్ లా మారిపోయారు. సన్నీ.. బాలయ్యలాగా ఫ్యాక్షన్ గెటప్ వేసాడు. శ్రీరామ్‌.. చిరంజీవి లాగా ముఠా మేస్త్రి గెటప్ వేశాడు. కాజల్‌.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి గెటప్ వేసింది. మానస్‌.. పవన్‌ కల్యాణ్‌ గెటప్, షణ్ను.. సూర్య గెటప్, సిరి.. జెనీలియాగా మారారు. వారు వేసిన పాత్రలకి న్యాయం చేస్తూ నటించారు. ఆ తర్వాత బిగ్ బాస్ ప్లే చేసిన సాంగ్స్ కి డ్యాన్సులు వేసి అదరగొట్టారు కంటెస్టెంట్స్.

Shriya : సినిమా చూడటానికి ఆటోలో వచ్చిన శ్రియ

వాళ్ళు వేసిన క్యారెక్టర్స్ లకు సంబంధించిన సినిమాలలోంచి సీన్స్ ని, సాంగ్స్ ని రీ క్రియేట్ చేశారు. సాంగ్స్ కి జంటలు జంటలుగా డ్యాన్సులు చేశారు. అందరూ కలిసి కూడా గ్రూప్ డ్యాన్స్ చేశారు. సినిమాలలోని సన్నివేశాల్ని కూడా బాగా నటించారు. దీంతో నిన్నటి ఎపిసోడ్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ కనపడింది. గొడవలు లేకుండా కంటెస్టెంట్స్ అంతా కలిసి ఈ టాస్కులని పూర్తిచేశారు.

Samantha : ‘పుష్ప’ ఐటెం సాంగ్‌లో సమంత అదరగొట్టే స్టిల్స్

అయితే ఈ టాస్క్ లో గెలిచి వాళ్లలో బెస్ట్ పర్ఫార్మర్ గా వచ్చిన వాళ్ళు ప్రేక్షకులని ఓట్లు అడగొచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. ఎవరు బాగా పర్ఫార్మ్ చేశారో అది కూడా కంటెస్టెంట్స్ నే డిసైడ్ చేయమన్నాడు బిగ్ బాస్. దీంతో అందరికి కాజ‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్ నచ్చ‌డంతో ఆమెను బెస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. అందరి ఏకాభిప్రాయంతో కాజ‌ల్‌ నిన్నటి టాస్క్ లో బెస్ట్ పర్ఫార్మర్ గా ఎంపికైంది.

Kamya Panjab : విడాకులు తీసుకుంటే చనిపోవాలా? : ఘాటు రిప్లై ఇచ్చిన నటి

ఆ తర్వాత ‘ఓట్ ఫర్ మి’ టాస్క్ ద్వారా ప్రేక్షకుల్ని ఓట్లు వేయ‌మ‌ని రిక్వెస్ట్ చేసింది. ”డే 1 నుంచి నేను ఎలా ఉన్నానో చూస్తున్నారు. బిగ్ బాస్‌కి రావడం అనేది నా డ్రీమ్. నా డ్రీమ్‌ నెరవేరింది. టాప్ 5కి ఒక్క అడుగుదూరంలో ఉన్నాను. నా ఫ్రెండ్స్ సన్నీ, మానస్‌లకు కూడా ఓటు వేయండి, వాళ్లతో పాటు టాప్ 5‌లో ఉంటే నా కల నెరవేరినట్టే. దయచేసి మాకు ఓటు వేసి సపోర్ట్ చేయండి” అని ప్రేక్షకుల్ని ఓట్లు అభ్యర్ధించింది కాజల్.