Kamya Panjab : విడాకులు తీసుకుంటే చనిపోవాలా? : ఘాటు రిప్లై ఇచ్చిన నటి

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విడాకుల తర్వాత నేను చనిపోవాలి అనుకున్నాను అనే వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది సమంత. తాజాగా ఇలాంటి విషయంపై ఓ బాలీవుడ్ నటి సోషల్ మీడియాలో నెటిజన్ కి......

Kamya Panjab : విడాకులు తీసుకుంటే చనిపోవాలా? : ఘాటు రిప్లై ఇచ్చిన నటి

Kamya

Kamya Panjab :  సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు, విడిపోవడాలు చాలా కామన్. ఆ తర్వాత వాళ్ళు వేరే వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పట్నుంచో ఇది జరుగుతుంది. అన్ని సినీ పరిశ్రమలలోని ఇది జరుగుతూనే ఉంటుంది. ఇటీవల టాలీవుడ్ లో సమంత నాగ చైతన్య కూడా ప్రేమ పెళ్లి చేసుకొని విడిపోయారు. దీనిపై సమంత పలుమార్లు స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విడాకుల తర్వాత నేను చనిపోవాలి అనుకున్నాను అనే వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది సమంత.

NTR : మా అమ్మది కర్ణాటకే : ఎన్టీఆర్

తాజాగా ఇలాంటి విషయంపై ఓ బాలీవుడ్ నటి సోషల్ మీడియాలో నెటిజన్ కి ఘాటు రిప్లై ఇచ్చింది. బాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత విడిపోవడం సర్వ సాధారణం. బాలీవుడ్ సీనియర్ నటి కామ్య పంజాబ్ గతంలో వ్యాపారవేత్త బంటీ నెగిని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరి మధ్య మనస్పరాధాలు రావడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న కామ్య గత ఏడాది శలాబ్ దంగ్ ని పెళ్లి చేసుకుంది.

Shannu – Siri : సిరి-షణ్నులపై ఫైర్ అయిన మాధవీలత..

తాజాగా ఈమె సోషల్ మీడియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడింది. ఈమె పోస్ట్ కి ఓ నెటిజన్.. నువ్వు నీ మొదటి వివాహ బంధాన్ని కొనసాగించలేకపోయి విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నావు. నీకంటూ హద్దులు లేవా? నువ్వు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నావా అని కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్ కి కామ్య ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఈ కామెంట్ పై కామ్య స్పందిస్తూ.. మహిళ సంతోషంగా ఉండకూడదా? విడాకుల తరువాత చనిపోవాలా? విడాకులు తీసుకున్న తర్వాత కూడా జీవితం ఉంటుంది. సమాజంలో ప్రతి మహిళ కూడా ధైర్యంగా నీలాంటి వాళ్లకి సమాధానం చెప్పాలి. నన్ను అంత తక్కువ అంచనా వెయ్యకు, నేనేమి బలహీనురాలిని కాను అని రిప్లై ఇచ్చింది.