NTR : మా అమ్మది కర్ణాటకే : ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కర్ణాటకలో జరిగిన ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ కన్నడలోనే మాట్లాడారు. దీంతో కన్నడ అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్‌..

NTR : మా అమ్మది కర్ణాటకే : ఎన్టీఆర్

Untitled Design

NTR :  దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు సినిమా యూనిట్. ఇటీవల వచ్చిన ట్రైలర్ ఈ సినీమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచాయి. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషన్స్ కూడా అన్ని భాషల్లో చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కు అన్ని భాషల్లోనూ ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, ఆలియా భట్, అజయ్ దేవగన్ పాల్గొన్నారు. తాజాగా బెంగుళూరులో జరిగిన కన్నడ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలు చెప్పారు అంతే కాక ఎమోషనల్ అయ్యారు.

Prabhas: ప్రభాస్ అంటే ఓ వైబ్రేషన్.. అందుకే ఏషియా టాప్ ప్లేస్ దాసోహం!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కర్ణాటకలో జరిగిన ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ కన్నడలోనే మాట్లాడారు. దీంతో కన్నడ అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్‌ కన్నడంలో మాట్లాడుతూ– ‘‘ఇల్లి జనగలను నోడదరె తుంబ ఖుషీ ఆక్తాయిదె. ఎల్లారు జత కన్నడ మాత్తాడన్‌ అవకాశ బందిదె. థ్యాంక్స్‌ టూ కర్ణాటక, నమ్మ తాయి కర్ణాటక మూలద. ఈగ నాను నటిసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర ఇల్లి కన్నడదల్లి డబ్‌ ఆగిదె. బహుళ సంతోష. కన్నడదల్లి నన్న వాయిస్‌ ఇరుత్తె” అని చెప్పారు. అంటే కన్నడ ప్రజలను చూస్తే ఆనందం వేస్తోంది. అందరి మధ్యలో కన్నడ భాష మాట్లాడటం ఆనందంగా ఉంది. మా అమ్మ కర్ణాటకకు చెందిన వారే. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కన్నడ డబ్‌లో కావడం చాలా సంతోషంగా ఉంది. నా సొంత వాయిస్‌ వినిపిస్తాను అని అర్ధం. దీంతో ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ గురించి చాలా సంవత్సరాల తర్వాత మరోసారి ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

Nayeem Diaries : నయీం డైరీస్ సినిమాలో లిప్ లాక్ సీన్‌‌పై అభ్యంతరం

ఈ ప్రెస్ మీట్ లో పునీత్ రాజ్ కుమార్ ని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్. కన్నడలో పునీత్ కోసం గతంలో ఆయన సినిమాలో ఎన్టీఆర్ ఒక సాంగ్ పాడారు. కన్నడ అభిమానుల కోసం ఎన్టీఆర్ ఆ పాటని పాడి వినిపించారు. దీంతో కన్నడ ప్రజలు తమ హీరో పునీత్ ని గుర్తు చేసుకొని పాట పాడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.