Nayeem Diaries : నయీం డైరీస్ సినిమాలో లిప్ లాక్ సీన్‌‌పై అభ్యంతరం

ఫిల్మ్ లో గాయని బెల్లి లలిత క్యారెక్టర్ అభ్యంతరకరంగా ఉందని...బెల్లి లలిత కుమారుడు సూర్యప్రకాష్ పిటిషన్ లో వెల్లడించారు. 1999లో బెల్లి లలిత దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

Nayeem Diaries : నయీం డైరీస్ సినిమాలో లిప్ లాక్ సీన్‌‌పై అభ్యంతరం

Nayeem

Kiss Scene From Nayeem Diaries : నయీం డైరీస్ సినిమాలో లిప్ లాక్ సీన్ అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బెల్లి లలిత కుమారుడు ఈ పిటిషన్ దాఖలు చేశారు. చిత్ర ప్రదర్శనపై హైకోర్టు స్టే విధించింది. నయీం డైరీస్ సినిమా 2021, డిసెంబర్ 10వ తేదీ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫిల్మ్ లో గాయని బెల్లి లలిత క్యారెక్టర్ అభ్యంతరకరంగా ఉందని…బెల్లి లలిత కుమారుడు సూర్యప్రకాష్ పిటిషన్ లో వెల్లడించారు. 1999లో బెల్లి లలిత దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

Read More : Cyber Fraud : గూగుల్‌‌లో సెర్చ్ చేసి రూ. 19 వేలు పొగొట్టుకొన్న యువతి

చిత్రంలో బెల్లి లలిత క్యారెక్టర్ అయిన ‘లత’ ను నయీం లిప్ లాక్ సీన్ చేయడాన్ని తప్పుబట్టారు. ఈ సీన్ తొలగించాలని డిమాండ్ చేశారు. విచారణ చేసిన హైకోర్టు…ప్రదర్శనపై స్టే విధించింది. అనంతరం సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. నయీం పోలీసు ఎన్ కౌంటరలో చనిపోయిన అనంతరం…అతని బయోపిక్ తీస్తానిన రాంగోపాల్ వర్మ ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. రచయిత దాము బాలాజీ తన దర్శకత్వంలోనే నయీమ్ డైరీస్ సినిమాను రూపొందించారు.

Read More : Covid Vaccination : కోవిడ్ టీకా ఏ సమయంలో వేయించుకోవాలో తెలుసా? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

ఐపీఎస్ అధికారి కె. ఎస్ వ్యాస్ హత్యతో నయీంకి ప్రత్యక్ష సంబంధం ఉందనే ఆరోపణలున్నాయి. ఖైదీగా ఉండగా..తన తమ్ముడితో కలిసి మావోయిస్టు సానుభూతిపరురాలు, గాయని బెల్లి లలిత హత్యకు కుట్ర పన్నాడని, అప్పట్లో నయీం హత్య చేయించాడంటూ…కుటుంబసభ్యులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అప్పట్లో జరిగిన ఈ దారుణ ఘటన…పెద్ద సంచలనం సృష్టించింది. అధికార పార్టీ నేతలను, అందులో చేరిన మాజీ నక్సలైట్లను నయీమ్ టార్గెట్ చేసి బెదిరించడం, చంపేయడంతో… చివరకు పోలీస్ ఎన్ కౌంటర్ లో నయీం చనిపోయాడు.