Covid Vaccination : కోవిడ్ టీకా ఏ సమయంలో వేయించుకోవాలో తెలుసా? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

కోవిడ్ టీకా ఏ సమయంలో వేయించుకోవాలో తెలుసా? ఉదయమా? మధ్యాహ్నమా? సాయంత్రమా? పరిశోధకులు ఏం సమయంలో వేయించుకంటే మంచిదని చెబుతున్నారంటే..

Covid Vaccination : కోవిడ్ టీకా ఏ సమయంలో వేయించుకోవాలో తెలుసా? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

Covid 19 Vaccination

Covid-19 Vaccination : కోవిడ్ మహమ్మారిని నియంత్రించటానికి ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి. అలా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. కానీ వ్యాక్సిన్ ఏ సమయంలో వేయించుకోవాలి?ఉదయం వేయించుకుంటే మంచిదా?మధ్యాహ్నమా?లేదా సాయంత్రం వేయించుకుంటే మంచిదా? ఏ సమయంలో వేయించుకోవాలి? అని మీకు ఎప్పుడున్నా డౌట్ వచ్చిందా?అసలు అటువంటి ఆలోచన వచ్చిందా?బహుశా వచ్చి ఉండదు. కానీ వ్యాక్సిన్ ఏ సమయంలో వేయించుకుంటే మంచిది? అని పరిశోధకులు ఆలోచించారు. దానిపై అధ్యయనం కూడా చేశారు. అలా చేసినవారి అధ్యయనంలో వ్యాక్సిన్ ‘మధ్యాహ్నం’ వేయించుకుంటే మంచిది అని తేలింది.

Read more : Human rights day : వేధింపులు భరించలేక మ‌హిళ‌లు ఉద్యోగాలు మానేస్తున్నారు : మానవ హక్కుల కమిషన్‌ అధ్యయనం

కొవిడ్‌పై చేసే పోరాటంలో మనిషి శరీరంలోని రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే కోవిడ్ ఏమీ చేయలేదు. దాన్ని వెంటనే ఎదుర్కోవచ్చు.. నువ్వు నా బాడీని ఏమీ చేయలేవని అని మన శరీరంలో ఉండే యాంటీ బాడీలతో దానిపై ఫైట్ చేసి పారద్రోలవచ్చు. అందుకే యాంటీ బాడీల వృద్ది కోసం ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్ ద్వారా శరీరం లోపల యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. రోజులో ఏ సమయంలో వ్యాక్సిన్‌ తీసుకున్నామనే అంశంపైన యాంటీబాడీల సామర్థ్యం ఆధారపడి ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.

వ్యాక్సిన్ వేయించుకోవటం ఉదయం కన్నా.. మధ్యాహ్న సమయంలో టీకాలు తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. జర్నల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ రిథం.. ఈ అధ్యయనాన్ని ప్రచురించింది. మనిషి సర్కాడియన్‌ క్లాక్‌(24 గంటల కాలచక్రం)లో.. శరీరంపై వ్యాధి, టీకా ప్రభావానికి కూడా తగిన సమయం ఉంటుందని వెల్లడించింది.

Read more : Omicron Variant: వ్యాక్సిన్ మూడో డోస్ తీసుకున్నా ఒమిక్రాన్ సోకింది

ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారికి లక్షణాల తీవ్రత, శ్వాస తీసుకునే విధానంలో ఇబ్బందులు.. రోజులో ప్రత్యేకంగా కొన్ని సమయాల్లోనే వస్తాయని తెలిపారు. బ్రిటన్‌లో.. టీకాలు తీసుకున్న 2,190 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ పరిశోధన జరుపగా..టీకా తీసుకున్న సమయంలో ఎటువంటి లక్షణాలు లేని ఆరోగ్య కార్యకర్తల రక్త నమూనాలను సేకరించారు. వారు వ్యాక్సిన్ వేయించుకన్న సమయం, ఏ రకమైన వ్యాక్సిన్ తీసుకున్నారు…వారి వయసు, వారు ఏ జెండర్ వారు వంటి విషయాల ఆధారంగా యాంటీబాడీల స్థాయి ప్రభావాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం తర్వాత టీకాలు తీసుకున్న వారందరికీ యాంటీబాడీల స్పందన ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. సో..వ్యాక్సిన్ మధ్యాహ్నం వేయించుకుంటే మంచిదని పరిశోధకులు తెలిపారు.