Omicron Variant: వ్యాక్సిన్ మూడో డోస్ తీసుకున్నా ఒమిక్రాన్ సోకింది

కోవిడ్-19 బూస్టర్ షాట్‌లను తీసుకున్న తర్వాత కూడా ఇద్దరు సింగపూర్ వ్యక్తులకు ఓమిక్రాన్ వేరియంట్‌ సోకింది.

Omicron Variant: వ్యాక్సిన్ మూడో డోస్ తీసుకున్నా ఒమిక్రాన్ సోకింది

Omicron

Omicron Variant: కోవిడ్-19 బూస్టర్ షాట్‌లను తీసుకున్న తర్వాత కూడా ఇద్దరు సింగపూర్ వ్యక్తులకు ఓమిక్రాన్ వేరియంట్‌ సోకింది. మూడవ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా నుంచి రక్షణ లభిస్తుంది అని అందరూ భావించినా.. 24ఏళ్ల మహిళా ఎయిర్‌పోర్ట్ ప్యాసింజర్-సర్వీస్ వర్కర్‌కు ఓమిక్రాన్‌ సోకింది.

ఒమిక్రాన్ వేరియంట్ ఫస్ట్ కేసు ఇది కాగా.. రెండవ వ్యక్తికి డిసెంబర్ 6న జర్మనీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సోకినట్లుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇద్దరికీ మూడవ డోస్ వ్యాక్సిన్‌లు అందాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఒమిక్రాన్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి మూడో డోసు అవసరం అంటూ అధ్యయనాలు చెబుతున్నాయి. కోవిడ్ -19 వ్యాక్సిన్ మూడవ డోస్ తీసుకుంటే వేరియంట్‌తో పోరాడే ప్రతిరోధకాలను తటస్థీకరించడంలో 25 రెట్లు తగ్గింపును గమనించినట్లు నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, వ్యాక్సిన్ అదనపు షాట్‌ వేసుకున్నవారికి కూడా ఒమిక్రాన్ సోకవచ్చునని మాత్రం చెబుతున్నారు.

Weight Loss : అధిక బరువును తగ్గించే పండ్లు ఇవే…

సింగపూర్‌లో గత నెలలో కరోనా కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. మొత్తం జనాభాలో 87% మంది పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నారు కూడా. అర్హులైన వారిలో 96శాతం మందికి పూర్తిగా వ్యాక్సిన్ వేశారు. ఎక్కువ మంది ఫైజర్ లేదా మోడెర్నాను తీసుకున్నారు. 29% మంది బూస్టర్ డోసులను కూడా తీసుకున్నారు. 5-11 ఏళ్ల వారికి త్వరలో వ్యాక్సిన్‌లు అందించనున్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.