Weight Loss : అధిక బరువును తగ్గించే పండ్లు ఇవే…

కాలంతో సంబంధం లేకుండా దొరికే పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ విధమైన పండ్లను తీసుకోవడం వల్ల శరీర బరువును పూర్తిగా తగ్గించుకోవచ్చు.

Weight Loss : అధిక బరువును తగ్గించే పండ్లు ఇవే…

Fruits

Weight Loss : అధిక శరీర బరువుతో చాలా మంది సతమతమౌతున్నారు. బరువును తగ్గించుకునేందుకు వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎలా బరువు తగ్గాలో వాళ్లకు తెలియదు. వాళ్లకే కాదు చాలామందికి బరువు తగ్గడం తెలియదు. ఎలాంటి డైట్ ను కూడా ఫాలో అవ్వాలో అర్ధంకాదు. అలాంటివారు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు అయిన‌ విటమిన్స్, మినరల్స్ పండ్లలో దాగి ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన శరీరానికి కావలసిన పోషకాలను అందించడమే కాకుండా మన శరీర బరువును తగ్గించడానికి కూడా పండ్లు దోహదపడతాయి.

కాలంతో సంబంధం లేకుండా దొరికే పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ విధమైన పండ్లను తీసుకోవడం వల్ల శరీర బరువును పూర్తిగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా జామ మనకు అన్ని కాలాలలోనూ దొరుకుతుంది. జామలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు లేకుండా తీసుకున్న ఆహార పదార్థాలు తేలికగా జీర్ణం అవుతూ శరీర బరువును నియంత్రించడానికి దోహదపడతాయి. బ‌రువు త‌గ్గుతారు.

అరటి ; అరటి పండులో 23 శాతం కార్బోహైడ్రేట్లు, 1 శాతం ప్రొటీన్‌లు, 2.6 శాతం ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా అరటిపండులో పొటాషియం కూడా లభిస్తుంది. అరటి పండు సులభంగా జీర్ణమై, మలబద్ధకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. అరటిపండు ఆకలిని తగ్గిస్తుంది. వ్యాయామానికి గంట ముందు అరటిపండుపై టేబుల్ స్పూన్ వేరుశనగ వెన్నను పూసి తింటే గొప్ప ఫలితం లభిస్తుంది. అందుకే వ్యాయామానికి ముందు అరటిపండును గొప్ప చిరుతిండిగా అభివర్ణించవచ్చు. వ్యాయామం చేసిన వారి శరీరంలో అలసిన కండరాలను అరటిపండు తిరిగి ఉత్తేజపరుస్తుంది. అలాగే కండరాల తిమ్మిర్లు తగ్గుతాయి. అరటిపండు ఇన్సులిన్ ఉత్తత్తికి ఎంతగానో తోడ్పడుతుంది. గుండె జబ్బులు రాకుండా అరటి పండును శరీరాన్ని కాపాడుతుంది. గుండెలో ఉండే నరాల ఒత్తిడిని తగ్గించి మాములు స్థాయికి తీసుకువస్తుంది.

జామపండు; జామపండు బరువు తగ్గడానికి అనువైన పండు. జామపండులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఉంటుంది. జామపండు తినడం వల్ల ఎక్కువకాలం జీవించవచ్చు. ఎందుకంటే ఇవి మీ జీవక్రియను నియంత్రిస్తాయి. మీ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలని భావించే వారికి జామపండు ఒక మంచి ఎంపిక. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి.  ఒకప్పుడు సీజన్‌లో మాత్రమే జామపండ్లు లభించేవి అయితే ప్రస్తుతం 365 రోజులు జామ పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి మానవ శరీరానికి ఎంతో మేలు చేసే జామ పండ్లను కచ్చితంగా తిని తీరాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆపిల్ పండు; ఆపిల్ ఆరోగ్యానికి మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, తక్కువ కేలరీలు ఉంటాయి. రోజుకో ఆపిల్ తీసుకుంటే అనారోగ్య సమస్య బారిన పడకుండా ఉంటారు. ఆపిల్‌లోని పీచు పదార్థం పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆపిల్‌లోని విటమిన్ సి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మధుమేహం వ్యాధితో బాధపడేవారు ఆపిల్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్ పాలలో కలిపి తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. తద్వారా రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. అధిక శాతం నీటిని కలిగి ఉన్న పుచ్చకాయ, కీరదోస, టమాటో వంటి పండ్లను తీసుకోవడం వ‌ల్ల త్వ‌రగా శరీర బరువును త‌గ్గించుకోవ‌చ్చు.

నారింజ పండు; బరువు తగ్గడానికి తీసుకునే పండ్లలో ఎక్కువగా నారింజ పండును తీసుకుంటారు. ఎందుకంటే పోషకాలలో నారింజ పండును మెండు అంటారు. ఇందులో చాలా తక్కువ పాళ్లలో కేలరీలు ఉంటాయి. నారింజలో ఎలాంటి సెచ్యురేటెడ్ ఫ్యాట్ లేదా కొలెస్ట్రాల్ ఉండదు. అంతేకాదు ఇందులో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. దీని వల్ల శరీరంలో ఉన్న విషతుల్యాలు బయటికి వెళ్లిపోతాయి. నారింజ పండు జీర్ణవ్యవస్థను పూర్తిగా, చక్కగా పని చేయడం మొదలు పెడుతుంది. నారింజలో అత్యధిరంగా విటమిన్ సి ఉంటుంది. ఇది ఒక సిట్రస్ ఫ్రూట్ గా చెప్పవచ్చు.

కివీ పండు; ఈ పండులో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది బరువు తగ్గేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేసింది. కివీ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండులో అధిక శాతం నీరు ఉంటుంది. అందువల్ల ఈ పండు తింటే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. గోల్డెన్ కివీ పండును ఫ్రూట్ సలాడ్‌లో మిక్స్ చేసుకుని తినవచ్చు. మిగిలిన పళ్లలో లేని ఎన్నో పోషక గుణాలు ఈ కివీ పండులో ఉన్నాయి. కివీ పండు కేవలం ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడమే కాదు.. ఇతర పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్‌గా పనిచేస్తుంది.

లిచీ పండు; ఈ పండు గురించి చాలా మంది విని ఉండరు. ఈ పండు మన దగ్గర పండదు. చైనాలో ఎక్కువగా పండుతుంది. ఈ పండు చూడటానికి ఎర్రగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ఈ పండును తింటే బరువు తగ్గుతారు. ఈ పండు కేవలం బరువు తగ్గడానికే కాదు. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చాలా రుచికరంగానూ ఉంటుంది. అయితే.. ఈ పండులో చాలా పోషకాలు ఉంటాయి. లిచీ పండ్లలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సీ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అది ఇన్ ఫెక్షన్లను రాకుండా కాపాడుతుంది. దీంతోపాటు తెల్లరక్తకణాలు పెరగడానికి లిచీ పండ్లు సహకరిస్తాయి. దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్ లో ఉంచాలన్నీ ఈ పండును ఖచ్చితంగా తినాల్సిందే. ఇందులో కాపర్, ఐరన్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉండే ఫైబర్.. ఈజీగా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.