Human rights day : వేధింపులు భరించలేక మ‌హిళ‌లు ఉద్యోగాలు మానేస్తున్నారు : మానవ హక్కుల కమిషన్‌ అధ్యయనం

పనిప్రదేశాలు..బహిరంగ ప్రాంతాల్లో వేధింపుల భరించలేక మ‌హిళ‌లు ఉద్యోగాలు మానేస్తున్నారని మానవ హక్కుల కమిషన్‌ అధ్యయనం వెల్లడించింది.

Human rights day : వేధింపులు భరించలేక మ‌హిళ‌లు ఉద్యోగాలు మానేస్తున్నారు : మానవ హక్కుల కమిషన్‌ అధ్యయనం

Human Rights Day

Human rights day : డిసెంబర్ 10. మానవ హక్కుల దినోత్సవం. మానవ హక్కులు గురించి మాట్లాడుకునే మనం..రాజ్యాంగం స్త్రీ పురుషులకు సమానంగా కల్పించిన హక్కుల గురించి మాట్లాడుకోవాలి. హక్కు అనేది ప్రతీ మనిషి ఉంటుంది. అలాగే ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ ప్రాణికి ఉంటుంది. సాటి మనిషి హక్కుల్నే హరించేస్తున్న క్రమంలో ఇక ప్రాణుల హక్కుల గురించి ఏం ఆలోచిస్తాడు? మానవ హక్కులు అంటే మహిళల హక్కులు అని ఎంతమందికి తెలుసు? హక్కులు లేనివారే వాటి గురించి పోరాడతారు. రాజ్యాం మహిళలకు సమాన హక్కులు కల్పించినా..అవి అమలు లేని పరిస్థిుతుల్లో మహిళలు వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. అలా పోరాడి సాధించుకున్నవే మహిళా చట్టాలు. కానీ చట్టాలు అయితే వచ్చాయి గానీ వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. ముఖ్యంగా అత్యాచారం..వరకట్నం వేధింపులు..లైంగిక వేధింపుల కేసుల్లో ఎంతమందికి న్యాయం జరుగుతోంది? న్యాయం ఎలా ఉన్నా..ప్రాణాలే హరించేస్తున్న అత్యంత దారుణ దౌర్భాగ్య దుస్థితిలో ఉంది ప్రస్తుతం చాలా హింసాత్మక కేసుల్లో.

అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడి..పైశాచికానందం పొందుతున్నారు. లైంగికంగా వేధించాడంటే సాక్ష్యాలేవి? అని ప్రశ్నించడం..పైగా అంత్యంత దారుణం ఏంటీ అంటే..‘‘చర్మాన్ని తాకకపోతే (స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ లేకపోతే )అవి లైంగిక వేధింపులు కావు…సాక్షాత్తు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. న్యాయమూర్తులే (కొంతమంది)ఇటువంటి దారుణ తీర్పులిస్తే ఇక బాధిత మహిళలు, యువతులు,చిన్నారుల పరిస్థితి ఏంటి? ఇటువంటి దౌర్భాగ్య దుస్థితిలో ఇక మానవ హక్కుల మాట ఎక్కుడుంది ఆడపుట్టుకల విషయంలో.!!

ఇంటి సంకెళ్లను తెంచుకుని మహిళ బయట సమాజంలో అడుగు పెట్టి చదువుకుని ఉద్యోగాలు చేస్తు అటు ఇంటి బాధ్యతలు..ఇటు ఆఫీసులో పని కూడా చేసుకుంటున్న మహిళలకు పక్కనే పొంచి ఉండే ప్రమాదం..లైంగిక వేధింపులు. పని ప్రదేశాల్లోను..ప్రయాణాల్లోను..బస్టాపుల్లోను ఇలా ఎక్కడైనా పొంచి ఉండే వేధింపులు..ఈ వేధింపుల్ని మౌనంగా భరించేవారు ఎంతోమంది. బయటకు చెప్పుకునేవారు కొంతమందే.ప్రశ్నించేవారు చాలా చాలా తక్కువ మందే. మహిళ విషయంలో పేరుకు చట్టాలున్నా, ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తాజా అధ్యయనం రుజువు చేస్తున్నది. లైంగిక వేధింపుల వల్ల ఎంతోమంది మహిళలు ఉద్యోగాలు మానేస్తున్నారని వెల్లడించిందీ అధ్యయనం..

లైంగిక వేధింపుల పరిస్థితి ఇలా..
లైంగిక వేధింపులతో చట్టాన్ని ఆశ్రయించేవారు 47 శాతం…
మౌనంగా వేధింపులను భరిస్తున్న వారు 24 శాతం.
ప్రశ్నించే ధైర్యం చేయలేని వారు 19.5 శాతం.
ఉద్యోగాలు మానేస్తున్న వారు 19.2 శాతం.
చట్టానికి పదునులేదని భావిస్తున్న వారు 65 శాతం.
ఫిర్యాదు చేయడం వల్ల ఉద్యోగం కోల్పోయినవారు 34.3 శాతం.

వేధింపుల్లో పలు విధాలు..
తాకడం ద్వారా 81 శాతం…
అసభ్యమైన వర్ణనలతో 80.4 శాతం…
ద్వంద్వార్థాలతో 61.6 శాతం…
బూతు జోక్స్‌ ద్వారా 45 శాతం…
ఫోన్‌ సంభాషణ ద్వారా 44 శాతం…
అసభ్యకర చూపుల ద్వారా 89 శాతం.
తమ ప్రైవేటు భాగాలు ప్రదర్శిస్తూ 24.2 శాతం.
బహుమతుల ద్వారా 26 శాతం…
పనిభారం తగ్గించేసాకుతో 15.9 శాతం…
ప్రమోషన్లు ఆశ చూపి 17.6 శాతం…
తప్పులు వెతకడం ద్వారా 35 శాతం…
వేతనాల కోత ద్వారా 25.3 శాతం..
అవమానించడం ద్వారా 17.2 శాతం..
కఠినమైన బాధ్యతల ద్వారా 10.9 శాతం..
ఇంక్రిమెంట్లను ఆపేయడం ద్వారా 10 శాతం..

వేధింపులకు పరిష్కారం..
రాజ్యాంగ అధికరణం 19 (1) జీవనోపాధి స్వేచ్ఛను ప్రసాదించింది. కానీ సకల అర్హతలతో, దీటైన నైపుణ్యంతో వృత్తి ఉద్యోగాల్లో అడుగుపెడుతున్న మహిళలకు అడుగడుగునా అవరోధాలే. ఈ లైంగిక వేధింపులను అరికట్టేందుకు భారత ప్రభుత్వం 2013లోనే చట్టం చేసింది. 10 మందికన్నా ఎక్కువ మహిళలు ఉన్న కార్యాలయాలు కచ్చితంగా లైంగిక వేధింపులను నిరోధించేందుకు ఓ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే ఆ అంతర్గత కమిటీ విచారణను ప్రారంభించి, 90 రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ సూచనలను ఆయా సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందే. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే సదరు ఉద్యోగిపై 509తో పాటు, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. నేరం రుజువైతే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు.

కాబట్టి వేధింపుల్ని సహించొద్దు..ప్రశ్నించండీ..పోరాడండి అని చెబుతోంది మానవహక్కుల సంఘం. ప్రతీ ఒక్కరికి హక్కు ఉంటుంది. వాటిని హరించే హక్కు ఎవ్వరిరలేదని తెలుసుకోండి..మీ హక్కుల్ని కాపాడుకోండి..మీ జీవితాన్ని మీరు స్వేచ్చగా అనుభవించండీ..పక్కవారి హక్కుల్ని హరించకుండా..