Prabhas: ప్రభాస్ అంటే ఓ వైబ్రేషన్.. అందుకే ఏషియా టాప్ ప్లేస్ దాసోహం!

ప్రభాస్ ఎక్కడున్నా బాసే. ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాని పాన్ ఇండియా రేంజ్ కి తెచ్చినా, టాలీవుడ్ కి 2 వేల కోట్ల కలెక్షన్ల మూవీ అందించినా.. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు..

Prabhas: ప్రభాస్ అంటే ఓ వైబ్రేషన్.. అందుకే ఏషియా టాప్ ప్లేస్ దాసోహం!

Babhubali Prabhas Dam Fight

Prabhas: ప్రభాస్ ఎక్కడున్నా బాసే. ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాని పాన్ ఇండియా రేంజ్ కి తెచ్చినా, టాలీవుడ్ కి 2 వేల కోట్ల కలెక్షన్ల మూవీ అందించినా.. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా.. బాలీవుడ్ డైరెక్టర్లని తన క్రేజ్ తో కట్టిపడెయ్యాలన్నా.. ఒక్క ప్రభాస్ కే సాధ్యం. అందుకే సౌత్ లో ఇండియా లోనే కాదు .. సౌత్ ఏషియాలోనే నంబర్ వన్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు స్టార్ హీరో ప్రభాస్. ఒక్క సినిమా కోసం 5 ఏళ్లు వెయిట్ చేసినా.. ఒకే సంవత్సరం లో 5 సినిమాలు అనౌన్స్ చేసినా.. ప్రభాస్ కే సాధ్యం. అలాగే ఒక్క సినిమాతో వందల కోట్ల కలెక్షన్లతో ఓవర్ నైట్ బాలీవుడ్ ని కూడా వెంటపడేలా చేసుకోవడం ప్రభాస్ కేసాధ్యం.

Balakrishna-Boyapati: ఆగని అఖండ హోరు.. డెడ్లీ కాంబినేషన్ బీబీ4 ప్లాన్స్?

ఇంత పెద్ద స్టార్ డమ్ ని అంతే ఈజ్ తో క్యారీ చేస్తూ.. వరసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ 2021లో సౌత్ ఏషియాలోనే నంబర్ వన్ సెలబ్రిటీగా రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రభాస్ అంటే ఫాన్స్ కి ఓ వైబ్రేషన్. ప్రభాస్ అంటే.. తెలుగు సినిమాకి బ్రాండ్. ప్రభాస్ అంటే గ్రాండియర్ కి ఐడెంటిటీ. ఇంత క్రేజ్ ఉన్న ప్రభాస్.. రష్యాలో ఈస్టర్న్ ఐ అనే వెబ్ సైట్ సర్వేలో ప్రభాస్ ఈ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ సర్వేలో ఏషియా నుంచి ఏకంగా 50 మంది పోటీపడితే.. వాళ్లందరికంటే టాప్ ప్లేస్ లో నంబర్ వన్ స్తానాన్ని దక్కించుకున్నారు ప్రభాస్.

Kriti Sanon: బచ్చన్ ఇంట్లోకి సనన్.. బాప్‌రే నెలకి లక్షల్లో అద్దె!

ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ దాటకుని పాన్ వరల్డ్ రేంజ్ కి వెళుతున్నారు. ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాదు.. ఒకేసారి 5 సినిమాలతో ఫుల్ బిజీగాఉన్నారు. రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి పాన్ ఇండియా సినిమాలతో ఎంగేజ్ అయిన ప్రభాస్ సందీప్ రెడ్డితో చెయ్యబోయే స్పిరిట్ సినిమాని మాత్రం అంతకుమించి ప్లాన్ చేశారు. పాన్ ఇండియాతో పాటు జపనీస్, చైనీస్ లాంటి ఫారెన్ లాంగ్వేజెస్ లో కూడా గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నారు.