Akhanda : ట్రైలర్ లోనే ఇన్ని మాస్ డైలాగ్స్ ఉంటే.. సినిమాలో??.. బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం

ఒక్క ట్రైలర్ లోనే దాదాపు 10 మాస్ డైలాగ్స్ ఉన్నాయి. ఒక్కో డైలాగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక సినిమాలో ఎన్ని డైలాగ్స్ ఉన్నాయో అని అంచనా వేస్తున్నారు అభిమానులు.

Akhanda : ట్రైలర్ లోనే ఇన్ని మాస్ డైలాగ్స్ ఉంటే.. సినిమాలో??.. బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం

Akhanda Trailer

Akhanda :  బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా ‘అఖండ’. నిన్న సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ అంటే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ట్రైలర్ చూసాక ఈ సారి బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం కన్ఫర్మ్ అనిపిస్తుంది. బాలయ్య రౌద్రానికి, బోయపాటి మాస్ తోడైతే ఎలా ఉంటుందో మరోసారి చూపించారు ట్రైలర్ లో. ఒక్క ట్రైలర్ లోనే దాదాపు 10 మాస్ డైలాగ్స్ ఉన్నాయి. ఒక్కో డైలాగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక సినిమాలో ఎన్ని డైలాగ్స్ ఉన్నాయో అని అంచనా వేస్తున్నారు అభిమానులు. యూట్యూబ్ లో చూస్తేనే హై వోల్టేజ్ లా ఉంటే అలాంటిది థియేటర్ లో సినిమా చూస్తే పూనకాలే..

Akhanda-Ghani : మరోసారి నందమూరి – మెగా వార్

ట్రైలర్ లో ఉన్న డైలాగ్స్ పై ఒక్కసారి మీరు కూడా లుక్ వేసేయండి..

‘విధికి, విధాతకు, విశ్వానికి సవాళ్లు విసరకూడదు’ అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.

‘మేమేంటో అంచనా లేకుండా హామీలిస్తున్నావు’ అని ప్రతినాయకుడు అంటే ‘అంచనా వేయడానికి నువ్వేమైన పోలవారం డ్యామా.. పట్ట్టిసీమ తూమా.. పిల్లకాలువ’ అని బాలయ్య బాబు తన స్టైల్ లో చెప్పి అదరగొట్టాడు.

ఇక విలన్ గా శ్రీకాంత్ ‘నాకు బురదొచ్చింది, నాకు దురదొచ్చింది, నాకు బ్లడ్ వచ్చింది, నాకు అడ్డొచ్చింది అని అడ్డమైన సాకులు చెప్తూ పని ఆపితే’ అని భయపెట్టాడు.

‘కళ్ళు తెరిచి జూలు విదిలిస్తే’.. అంటూ బాలయ్య అఖండ గెటప్ ఎంట్రీ గురించి గ్రాండ్ గా చెప్పారు.

ఇక బాలయ్య వరుసగా…

‘ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే నేనంటే శాసనం.. దైవ శాసనం’

‘ఒక్క సారి డిసైడ్‌ అయ్యి బరిలో దిగితే.. బ్రేకులు లేని బుల్‌డోజర్‌ను. తొక్కి పారేస్తా’

‘లెఫ్ట్, రైటా, టాప్, బాటమ్ ఎటు నుంచి ఎతికినా కొడకా ఇంచు బాడీ దొరకదు’

Bigg Boss 5 : నిన్న దీప్తి.. ఇవాళ జ్యోతి.. సన్నీపై ఫైర్ అవుతున్న మాజీ కంటెస్టెంట్స్

‘మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకు పిండం పెడతాము’ అంటూ బోయపాటి మాస్ డైలాగ్స్ ని బాలయ్య ఊర మాస్ గా చెప్పారు. దీంతో సినిమా కోసం అభిమానులతో పాటు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2 న విడుదల అవ్వనుంది. మరోసారి థియేటర్స్ షేక్ అవ్వడం కన్ఫర్మ్.