Akhil : ఏజెంట్ పోయింది.. మరి అఖిల్ నెక్స్ట్ సినిమా ఏంటి? వాళ్ళతోనేనా?

అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు యావరేజ్ గా ఆడిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేదు. ఇప్పుడు ఏజెంట్ కూడా పోవడంతో మరి అఖిల్ నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు నెటిజన్లు, అభిమానులు.

Akhil : ఏజెంట్ పోయింది.. మరి అఖిల్ నెక్స్ట్ సినిమా ఏంటి? వాళ్ళతోనేనా?

Akhil Akkineni next movie update

Akhil :  అక్కినేని అఖిల్, సాక్షి వైద్య(Sakshi Viadya) జంటగా, మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్(Agent) సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోలేక పరాజయం పాలైంది. అసలు ఇలాంటి సినిమా ఎలా తీశారు అని డైరెక్టర్, హీరో ఇద్దర్ని అభిమానులు, ప్రేక్షకులు తెగ విమర్శిస్తున్నారు.

అఖిల్ ఎంతో హార్డ్ వర్క్ చేసి బాడీ మేకోవర్ చేసుకొని తీసిన ఏజెంట్ సినిమా కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది అనుకుంటే భారీ ఫ్లాప్ అవ్వడంతో అఖిల్ కెరీర్ మరింత డౌన్ అయింది. అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు యావరేజ్ గా ఆడిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేదు. ఇప్పుడు ఏజెంట్ కూడా పోవడంతో మరి అఖిల్ నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు నెటిజన్లు, అభిమానులు.

Agent Twitter Review : మిక్స్‌డ్ టాక్.. ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. ఈ సారన్నా అయ్యగారు హిట్ కొడతారా?

అయితే తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం అఖిల్ ఆల్రెడీ నెక్స్ట్ సినిమా కూడా ఓకే చేశాడని సమాచారం. ఓ కొత్త దర్శకుడితో ప్రభాస్ నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ లో ఈ సినిమా తెరకెక్కిస్తారని సమాచారం. ఇప్పయికే కథ ఓకే చేసినట్టు, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకురావాలని కూడా అనుకుంటున్నారట. మరి కెరీర్ డౌన్ ఫాల్ లో ఉన్న అఖిల్ కి ఈ సినిమా ఓకే అవుతుందా? అసలు జాన్వీ ఒప్పుకుంటుందా చూడాలి. అయ్యగారు మళ్ళీ ఎప్పటికి థియేటర్స్ లో సందడి చేస్తారో చూడాలి.