Akhil sarthak : VJ సన్నీపై ఫైర్ అయిన అఖిల్ సార్థక్.. నువ్వు హీరో అవ్వడానికి పక్కవాళ్ళని జీరో చేయకు..

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో VJ సన్నీ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సోహెల్ ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయగా సోషల్ మీడియాలో సోహెల్ ఫ్యాన్స్ సన్నీపై ఫైర్ అవుతున్నారు........

Akhil sarthak :  VJ సన్నీపై ఫైర్ అయిన అఖిల్ సార్థక్.. నువ్వు హీరో అవ్వడానికి పక్కవాళ్ళని జీరో చేయకు..

Akhil Sarthak

VJ Sunny :   తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ విన్నర్‌ వీజే సన్నీ హీరోగా చేస్తున్న సినిమా ‘సకలగుణాభిరామ’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్ జరిగింది. దీనికి విశ్వక్ సేన్, అనిల్ రావిపూడిలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వీరితో పాటు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ అందరూ, గత సీజన్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొంతమంది కూడా హాజరయ్యారు. వారంతా సినిమాని ప్రమోట్ చేశారు. స్టేజిపై మాట్లాడారు.

అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో VJ సన్నీ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సోహెల్ ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయగా సోషల్ మీడియాలో సోహెల్ ఫ్యాన్స్ సన్నీపై ఫైర్ అవుతున్నారు. VJ సన్నీ సోహెల్ గురించి మాట్లాడుతూ.. ”నాల్గో సీజన్‌లో సోహెల్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ వీడు డబ్బులు తీసుకుని వచ్చేసిండు. నన్ను కూడా అందరూ అంతే అన్నారు. నీకన్నా 10 లక్షలు ఎక్కువే పెట్టిర్రు. అయినా సరే టెంప్ట్‌ కాలేదు. కళావతి(సన్నీ తల్లి)కి కప్పు ముఖ్యం బిగిలూ.. అందుకే గెలిచి వచ్చా’ అని గర్వంగా చెప్పాడు సన్నీ. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

Lata Mangeshkar : ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు : నందమూరి బాలకృష్ణ

సన్నీ గెలిచాక ఇలా మాట్లాడటం సరికాదని, స్టేజిపై అందరి ముందు సోహెల్ ను అవమానించాడని.. ఇలా పలు రకాలుగా సన్నీపై నెటిజన్లు, సోహెల్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే సన్నీ వ్యాఖ్యలపై గత సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్‌ సార్థక్ పరోక్షంగా స్పందించాడు. సన్నీ పేరు వాడకుండానే ఫైర్ అయ్యాడు. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఈ విషయం పై పోస్ట్ చేశాడు.

Jaya Bachchan : అమితాబ్ భార్య జయాబచ్చన్‌కి కరోనా పాజిటివ్..

అఖిల్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో.. ”ఎవరినైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు వారిని గౌరవించాలే తప్ప అవమానించకూడదు. మనం హీరో అవడానికి పక్కవాళ్లను జీరో చేయొద్దు బ్రదర్‌. నా స్నేహితుడిని అలాంటి పరిస్థితుల్లో స్టేజీ మీద చూడటం చాలా బాధగా అనిపించింది. అప్పుడు నేనక్కడ ఉంటే బాగుండేది’ అని పోస్ట్ చేశాడు. అయితే ఆ తర్వాత కాసేపటికే దానిని డిలీట్ చేయడం విశేషం.