Lata Mangeshkar : ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు : నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ విడుదల చేసినా ఈ పత్రిక ప్రకటనలో.. '' భారతదేశపు ముద్దుబిడ్డ లతా మంగేష్కర్. ఆమె మృతి దేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరని లోటు. లతా మంగేష్కర్ మృతి వార్త.......

Lata Mangeshkar : ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు : నందమూరి బాలకృష్ణ

Balakrishna

 

Nandamuri Balakrishna :  భారత గానకోకిల లతా మంగేష్కర్ గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి మరియు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరారు. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు, కోలుకుంటున్నారు అనుకునేలోపే ఆదివారం ఉదయం కన్నుమూశారు. సింగర్ లతా మంగేష్కర్ మరణంపై దేశ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులు నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు ఆమె గురించి పోస్ట్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ.. లతా మంగేష్కర్ మృతిపై సంతాపం తెలియచేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

నందమూరి బాలకృష్ణ విడుదల చేసినా ఈ పత్రిక ప్రకటనలో.. ” భారతదేశపు ముద్దుబిడ్డ లతా మంగేష్కర్. ఆమె మృతి దేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరని లోటు. లతా మంగేష్కర్ మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 7 దశాబ్దాలలో 30కి పైగా భాషల్లో 30 వేల పాటలకు పైగా పాడటం లతా మంగేష్కర్ గాన మాధుర్యానికి నిదర్శనం. దేశంలో ఆమె పాట వినని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేదు. ఆమె పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదు.”

Jaya Bachchan : అమితాబ్ భార్య జయాబచ్చన్‌కి కరోనా పాజిటివ్..

”భారతరత్న, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. ఇవే కాక విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలు అందించి ఆమెను గౌరవించాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.” అని తెలిపారు.