Chaithu-Akhil : అన్న క్లాస్ – తమ్ముడు మాస్.. బ్లాక్ బస్టర్ ఎవరిదో?

తమ్ముడు మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతుంటే, అన్న మాత్రం ఇంకా లవ్ రొమాన్స్ అంటూ సాఫ్ట్ క్యారెక్టర్స్ కే మొగ్గు చూపుతున్నాడు. అక్కినేని నాగ చైతన్య థాంక్యూ, అఖిల్ ఏజెంట్ సినిమాలతో ఇధ్దరూ ఒకే సీజన్ లో వస్తూ అక్కినేని అభిమానులకు..............

Chaithu-Akhil : అన్న క్లాస్ – తమ్ముడు మాస్.. బ్లాక్ బస్టర్ ఎవరిదో?

Thank You Movie

Akkineni :  తమ్ముడు మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతుంటే, అన్న మాత్రం ఇంకా లవ్ రొమాన్స్ అంటూ సాఫ్ట్ క్యారెక్టర్స్ కే మొగ్గు చూపుతున్నాడు. అక్కినేని నాగ చైతన్య థాంక్యూ, అఖిల్ ఏజెంట్ సినిమాలతో ఇధ్దరూ ఒకే సీజన్ లో వస్తూ అక్కినేని అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన థాంక్యూ టీజర్, ట్రయిలర్, సాంగ్స్ లో బ్యూటిఫుల్ సీన్స్ తో పాటు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అవుతోంది. ఫీల్ గుడ్ మూవీగా ఆకట్టుకుంటోంది. అయితే భారీ కమర్షియల్ సక్సెస్ కావాలన్నా, స్టార్డమ్ రావాలన్నా సాఫ్ట్ క్యారెక్టర్స్ కన్నా మాస్ సక్సెస్ కొడితేనే ఈజీగా ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు, మార్కెట్ స్పాన్ పెరుగుతుంది. కాని గతంలో చైతూ మాస్ ట్రై చేసినా అవి వర్కౌట్ అవ్వకపోవడంతో తనకి కలిసొచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ తోనే సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నాడు. అఖిల్ మాత్రం ఈసారి మాస్ యాక్షన్స్ కి షిఫ్ట్ అయ్యాడు. మొదటి సినిమా క్లాస్ మాస్ కలిపినా ఆ తర్వాత క్లాస్ సినిమాలతో వచ్చినా అంతగా సక్సెస్ కాలేదు. దీంతో ఫుల్ మాస్ యాక్షన్ లో పడ్డాడు అఖిల్.

 

సాఫ్ట్ గా ఉండే అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో పూర్తిగా మేకోవర్ చేంజ్ చేసి సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ సినిమాతో ఫ్యాన్స్ కు లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ తో మాస్ ట్రీట్ ఇచ్చాడు. స్పై ఏజెంట్ గా జేమ్స్ బాండ్ తరహాలో చేసే యాక్షన్ ఫీట్స్, లాంగ్ హెయిర్, బాడీ బిల్డింగ్ అన్నీ అక్కినేని ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆగస్టు 12న ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ అండ్ హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికి టీజర్ మాత్రమే వదిలారు చిత్ర యూనిట్. అయితే సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Ram Charan : మళ్ళీ మొదలు కానున్న RC15.. ఏపీలో కొత్త షెడ్యూల్..

ఇక నాగచైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో మనం తర్వాత వస్తోన్న ఫీల్ గుడ్ మూవీ థాంక్యూ. ఈ సినిమాలో నాగచైతన్య మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తూ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రయిలర్ తోనే ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేశాడు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ రాశిఖన్నా, అవికా గోర్ , మాళవికా నాయర్ తో చైతూ రొమాన్స్ చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో మరో ప్రేమమ్ లా హిట్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా జులై 22న రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. మరి అన్న క్లాస్ సినిమాతో తమ్ముడు మాస్ సినిమాతో కొద్ది రోజుల వ్యవధిలో రాబోతున్నారు. ఎవరు బ్లాక్ బస్టర్ కొడతారో లేదా ఇద్దరూ హిట్ కొడతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.