F3 Movie : హిట్ సినిమాని బాగోలేదని ప్రచారం చేస్తున్నారు.. F3 సక్సెస్ మీట్‌లో సీరియస్ అయిన ఆలీ..

కమెడియన్ ఆలీ మాట్లాడుతూ..''కొంతమంది హిట్టయిన సినిమాను కూడా బాగాలేదని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఇలా ప్రచారం..........

F3 Movie :  హిట్ సినిమాని బాగోలేదని ప్రచారం చేస్తున్నారు.. F3 సక్సెస్ మీట్‌లో సీరియస్ అయిన ఆలీ..

Ali

F3 Movie :  వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా ఆలీ, సునీల్, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రల్లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో F2 సినిమా హిట్ అయిన ప్రేరణతో F3 తీశారు అనిల్ రావిపూడి. మే 27న రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చి పాజిటివ్ టాక్ తో మంచి విజయం సాధించింది. సినిమా రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకెళ్తుంది.

అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా మీద కొంతమంది కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి దీనిపై స్పందిస్తూ నేను కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశాను, ఇందులో ఫైట్స్, మాస్ మషాలాలు ఉండవు అని క్లియర్ గా చెప్పారు. అయినా కొంతమంది బాగున్న సినిమాకి కూడా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. తాజాగా F3 సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఇందులో కమెడియన్ ఆలీ ఈ విషయంపై మాట్లాడుతూ సీరియస్ అయ్యారు.

Poonam Pandey : ఓ బ్రిడ్జిపై అశ్లీల వీడియో చిత్రీకరించినందుకు.. నటి పూనమ్ పాండేపై కేసు నమోదు..

కమెడియన్ ఆలీ మాట్లాడుతూ..”కొంతమంది హిట్టయిన సినిమాను కూడా బాగాలేదని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఇలా ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారనే విషయానికి F3 సక్సెస్‌ ఓ నిదర్శనం, ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్ నిదర్శనం. మీరు నెగిటివ్ ప్రచారం చేసినా, సినిమాకి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి వస్తూనే ఉన్నారు’’ అని తెలిపారు.