Poonam Pandey : ఓ బ్రిడ్జిపై అశ్లీల వీడియో చిత్రీకరించినందుకు.. నటి పూనమ్ పాండేపై కేసు నమోదు..
బాలీవుడ్ మోడల్, నటి పూనమ్ పాండే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తన వ్యాఖ్యలతో, తన చేష్టలతో, తన హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో...............

Poonam Pandey
Poonam Pandey : బాలీవుడ్ మోడల్, నటి పూనమ్ పాండే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తన వ్యాఖ్యలతో, తన చేష్టలతో, తన హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో పూనమ్ సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా నిలుస్తుంది. ఇటీవల లాకప్ షోలో కూడా పాల్గొని అందరిని తనవైపుకు తిప్పుకుంది. తాజాగా పూనమ్ మరోసారి వార్తల్లో నిలిచింది. పూనమ్ పాండేతో పాటు ఆమె మాజీ భర్త శాంబాంబేపై గోవాలోని కెనకొనా పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు.
2020లో కెనకొనా ప్రాంతంలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చాపోలి డ్యామ్ వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించారని, న్యూడ్ పోటోషూట్‌లో పాల్గొన్నారని అక్కడి స్థానికులు కొంతమంది పాండేపై, అవి చిత్రీకరించిన ఆమె మాజీభర్త శాంబాంబేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దానిపై విచారణ జరిపించారు. కొన్ని రోజుల క్రితం ఆ డ్యామ్ పై చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం చేసినందుకు గాను వారిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Kamalhaasan : పాన్ ఇండియా చాలదు.. పాన్ వరల్డ్ కావాలి..
ఇక 2021లో పాండే తన భర్త శారీరకంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో శాంబాంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి ఆమె భర్తతో విడిపోయి దూరంగా ఉంటుంది. ఈ కేసుపై వారిద్దరికీ నోటీసులు పంపించారు గోవా పోలీసులు.