Alia-Ranbir : ఫొటోగ్రాఫర్స్ పై ఫైర్ అయిన అలియా, రణబీర్.. కోర్టుకు వెళతాం అంటూ హెచ్చరిక..

తాజాగా అలియా, రణబీర్ ఈ ఫొటోగ్రాఫర్స్ పై ఫైర్ అయ్యారు. అలియా, రణబీర్ కి పాప పుట్టిన తర్వాత నుంచి వీరిపై మీడియా, ఫొటోగ్రాఫర్స్ ఫోకస్ మరింత ఎక్కువైంది. అయితే ఇటీవలే అలియా తన ఇంట్లో బాల్కనీలో కూర్చొని ఉంటే..................

Alia-Ranbir : ఫొటోగ్రాఫర్స్ పై ఫైర్ అయిన అలియా, రణబీర్.. కోర్టుకు వెళతాం అంటూ హెచ్చరిక..

Alia Bhatt and Ranbir Kapoor serious on Photographers

Alia-Ranbir :  బాలీవుడ్ జంట అలియా, రణబీర్ కపూర్ ప్రస్తుతం ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క తమ కూతురు రాహాతో లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు. సాధారణంగానే సెలబ్రిటీలు ఏం చేస్తారు అని మీడియా అంతా వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది. ఇక బాలీవుడ్ లో అయితే కొంతమంది ఫొటోగ్రాఫర్స్ సెలబ్రిటీల ఇళ్ల ముందే పడిగాపులు కాస్తారు. వాళ్ళ వెనకే పడతారు. ఇటీవల కొంతమంది ఫొటోగ్రాఫర్స్ సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి కూడా వెళ్లిపోవడంతో సైఫ్ వాళ్లపై కౌంటర్లు వేశాడు. వీరివల్ల బాలీవుడ్ సెలబ్రిటీలు అనేక ఇబ్బందులు పడుతూ, పర్సనల్ లైఫ్ ని కోల్పోతున్నారు.

తాజాగా అలియా, రణబీర్ ఈ ఫొటోగ్రాఫర్స్ పై ఫైర్ అయ్యారు. అలియా, రణబీర్ కి పాప పుట్టిన తర్వాత నుంచి వీరిపై మీడియా, ఫొటోగ్రాఫర్స్ ఫోకస్ మరింత ఎక్కువైంది. అయితే ఇటీవలే అలియా తన ఇంట్లో బాల్కనీలో కూర్చొని ఉంటే తనని ఎవరో గమనిస్తున్నారని అనుమానం వచ్చి చూస్తే పక్క బిల్డింగ్ పై నుంచి కెమెరాలు పట్టుకొని తమ ఇంటివైపు చూస్తున్నారని గమనించింది. దీనిపై తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ప్రస్తావిస్తూ సీరియస్ అయింది.

అలియా మాట్లాడుతూ.. నాతో తమాషా చేస్తున్నారా? మా ఇంటిపై కెమెరాలతో నిఘా పెడతారా? మాకు వ్యక్తిగత లైఫ్ ఉండదా? మా వెనకాలే ఉంటారా అంటూ సీరియస్ అయింది. ఇక ఇదే ప్రెస్ మీట్ లో రణబీర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. మీరు మా ఇంట్లోకి కూడా వచ్చేస్తారా? ఇంట్లో కూడా తొంగిచూస్తారా? ఇది చాలా తప్పు కదా. ఇండస్ట్రీలో ఫొటోగ్రాఫర్స్, మేము కలిసి పనిచేయాలి. మాకు మీరు అవసరం, మీకు మేము అవసరం. కానీ మీరు ఇలాంటి పనులు చేస్తే మీ మీద చిన్న చూపు ఏర్పడుతుంది. దీనిపై మేము చట్టపరంగా వెల్దామనుకుంటున్నాము. అసలు దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు. వారు చేసిన పనిని తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది అని సీరియస్ అయ్యాడు. దీంతో వీరి వ్యాఖ్యలు బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.

Ram Charan : నాటు నాటు పాట వల్ల నాలుగు కిలోల బరువు తగ్గాను.. రామ్ చరణ్

మొన్న సైఫ్, ఇప్పుడు అలియా రణబీర్ మాత్రమే కాదు ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. రణబీర్ చట్టపరంగా వెళ్తామని చెప్పడంతో ఇప్పటికైనా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ లోకి ఫొటోగ్రాఫర్స్ వెళ్లడం ఆపుతారేమో చూడాలి.