Bhool Bhulaiyaa 2: పాపం బాలీవుడ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే.. రిజల్ట్ ఎలా ఉంటుందో?

కరోనా తర్వాత బాలీవుడ్ పరిస్థితి అద్వాన్నంగా తయారైన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు, బడా బడా కాంబినేషన్లు ఉన్న సినిమాలు కూడా బాక్సాపీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. స్టార్ హీరో సినిమా వస్తున్నా కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోతున్నారు.

Bhool Bhulaiyaa 2: పాపం బాలీవుడ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే.. రిజల్ట్ ఎలా ఉంటుందో?

Bhool Bhulaiyaa 2

Bhool Bhulaiyaa 2: కరోనా తర్వాత బాలీవుడ్ పరిస్థితి అద్వాన్నంగా తయారైన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు, బడా బడా కాంబినేషన్లు ఉన్న సినిమాలు కూడా బాక్సాపీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. స్టార్ హీరో సినిమా వస్తున్నా కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోతున్నారు. ఇదే సమయంలో మన సౌత్ సినిమాలు నార్త్ లో దుమ్మురేపుతున్నాయి. పుష్ప నుండి తాజాగా కేజీఎఫ్ 2 వరకు బాలీవుడ్ లో భారీ కలెక్షన్లు కొల్లగొట్టి ఓపెనింగ్ డే రోజే డబుల్ డిజిట్ కోట్లు రాబడితే.. బాలీవుడ్ సినిమాలు రిలీజ్ రోజే కోటి రాబట్టేందుకు కూడా అష్టకష్టాలు పడుతున్నాయి.

Bollywood: ఒకవైపు సౌత్.. మరోవైపు హాలీవుడ్.. బాలీవుడ్‌కు దెబ్బ మీద దెబ్బ!

ఇలాంటి కష్టకాలంలో నిన్నటి వరకు ఆదుకుంటారని అనుకున్న సినిమాలు తీరా థియేటర్ల వద్దకు వచ్చి నీరుగార్చాయి. ఆ మధ్య వచ్చిన బచ్చన్ పాండే నుండి గ‌త వీకెండ్లో వ‌చ్చిన హిందీ సినిమా జ‌యేష్ భాయ్ జోర్దార్ వరకు అన్నీ భారీ అంచనాలతోనే రాగా తొలి రోజు కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి చేయ‌లేక‌పోయాయి. అందుకే ఇక ఇవన్నీ జరిగే పనులు కాదు.. అమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా వస్తే తప్ప బాలీవుడ్ కి మంచి రోజులు రావని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఓ సినిమా మళ్ళీ బాలీవుడ్ మేకర్స్ కు ఆశలు కల్పిస్తుంది. అదే భూల్ భూల‌యియా-2.

Tollywood-Bollywood: టాలీవుడ్ టూ బాలీవుడ్.. స్టార్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్!

అక్ష‌య్ కుమార్ న‌టించిన చంద్ర‌ముఖి రీమేక్ భూల్ భూల‌యియాకు భూల్ భూల‌యియా-2 సీక్వెల్. అనీస్ బ‌జ్మి రూపొందించిన ఈ సినిమాలో కార్తీక్ ఆర్య‌న్, కియారా అద్వానీ, ట‌బు ముఖ్య పాత్ర‌లు పోషించగా మే 20న విడుదల కానుంది. ఇటీవ‌ల విడుదలైన ట్రైల‌ర్ స‌ర‌దాగా, థ్రిల్లింగ్‌గా సాగ‌డంతో ఇంట్రెస్ట్ మొదలైంది. ఆ అంచనాలతోనే ఐదు రోజుల ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.1 కోటి రూపాయ‌లు రాబ‌ట్టింద‌ట‌. ఇది ఒకరకంగా ఇప్పుడు బాలీవుడ్ కి పెద్ద అమౌంట్. ఏ మాత్రం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. తొలి రోజు భారీ ఓపెనింగ్ సాధించే ఛాన్స్ ఉంటుంది. అందుకే బాలీవుడ్ లో ఇప్పుడు చర్చంతా ఈ సినిమాపైనే.