Bollywood: ఒకవైపు సౌత్.. మరోవైపు హాలీవుడ్.. బాలీవుడ్‌కు దెబ్బ మీద దెబ్బ!

బాలీవుడ్ సినిమాపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ధైర్యంగా ఓ సినిమాను రిలీజ్ చేయాలంటే అక్కడి మేకర్స్ కి చెమటలు పడుతున్నాయి. సౌత్ సినిమాలు ఓ వైపు.. హాలీవుడ్ ప్రాజెక్టులు మరోవైపు రౌండప్ చేసి..

Bollywood: ఒకవైపు సౌత్.. మరోవైపు హాలీవుడ్.. బాలీవుడ్‌కు దెబ్బ మీద దెబ్బ!

Bollywood

Bollywood: బాలీవుడ్ సినిమాపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ధైర్యంగా ఓ సినిమాను రిలీజ్ చేయాలంటే అక్కడి మేకర్స్ కి చెమటలు పడుతున్నాయి. సౌత్ సినిమాలు ఓ వైపు.. హాలీవుడ్ ప్రాజెక్టులు మరోవైపు రౌండప్ చేసి నార్త్ హీరోలకి నిద్రలేకుండా చేస్తున్నాయి. అసలే డేట్ చూసి చూసి ఫిక్స్ చేసుకుంటుంటే.. ఆ రిలీజ్ తేదీపై దక్షిణాది సినిమాల ఎఫెక్ట్ మాత్రమే కాదు.. ఇంగ్లీష్ మూవీస్ కూడా ఢీకొట్టేందుకు కాలు దువ్వుతున్నాయి.

Bollywood: కమర్షియల్ కంటెంట్‌కు దూరమైన బాలీవుడ్.. అందుకే సౌత్ డామినేషన్!

వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ను చిన్న టీజర్ తోనే బుట్టలో పడేసింది అవతార్ 2. పండోరాను మించిన అందాలు, నీటి లోతుల్లో ఫ్యామిలీతో హీరో జేక్ చేసే విన్యాసాలు, మానవులతో మళ్లీ యుద్ధం, కేట్ విన్స్ లెట్ లాంటి వాళ్ల స్పెషల్ అట్రాక్షన్… ఇలా విజువల్ వండర్ కాన్సెప్ట్ తో అవతార్ సీక్వెల్ ను రెడీ చేసారు డైరెక్టర్ జేమ్స్ కామరూన్. డిసెంబర్ 16న 160 భాషల్లో అవతార్2ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. అంతా బాగానే ఉంది కానీ అవతార్ వస్తున్నాడంటే బాలీవుడ్ దర్శకనిర్మాతకు చెమటలు పడుతున్నాయి.

Tollywood-Bollywood: టాలీవుడ్ టూ బాలీవుడ్.. స్టార్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్!

డిసెంబర్ లో బాలీవుడ్ లో పెద్ద సినిమాల రిలీజ్ లున్నాయి. ముఖ్యంగా క్రిస్ మస్ సీజన్ ను నమ్ముకుని స్టార్స్ థియేటర్స్ కొస్తామంటున్నారు. డిసెంబర్ 23న రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే జంటగా నటించిన సర్కస్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సింబా, సూర్యవంశీ తర్వాత రోహిత్ శెట్టి డైరెక్షన్ లో రణ్ వీర్ నటించిన సినిమా ఇది. ఇక సర్కస్ తో పాటూ అదే రోజూ టైగర్ ష్రాఫ్ గణపత్ పార్ట్ 1… కత్రినా కైఫ్ తో విజయ్ సేతుపతి నటిస్తోన్న మెర్రీ క్రిస్మస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ మూడు సినిమాలకు బాలీవుడ్ లో పాజిటివ్ బజే నడుస్తోంది ప్రస్తుతం.

Bollywood : రంజాన్ వీకెండ్ కూడా బాలీవుడ్ కి కలిసి రాలేదు.. బోల్తా పడ్డ భారీ సినిమాలు..

అన్నింటికి మించి డిసెంబర్ 30న సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దివాళి సినిమా రిలీజ్ కానుంది. టాలీవుడ్ హీరో వెంకటేశ్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ చేస్తున్నారిందులో. అయితే డిసెంబర్ 16న అవతార్ 2 థియేటర్స్ లో దిగితే ఈ నాలుగు బాలీవుడ్ సినిమాలపై ఆ ఎపెక్ట్ ఉంటుంది. పార్ట్ 1తో 20 వేల 368 కోట్లు రాబట్టిన అవతార్.. పార్ట్ 2తో అంతకుమించిన టార్గెట్ పెట్టుకుంది. ఒక వేళ అందరి అంచనాలకు మించిన స్టఫ్ తో అవతార్ 2 వచ్చిందంటే.. ఆ దెబ్బను సల్మాన్, రణ్ వీర్, టైగర్, కత్రినా తట్టుకుంటారా అన్నది ఇప్పుడు జవాబు లేని ప్రశ్న.

Bollywood Remakes: రీమేక్ మాయలో బాలీవుడ్.. సౌత్ కంటెంట్ కావాలంటున్న స్టార్స్!

ఎన్నో ఏళ్ల తర్వాత ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న అవతార్ సీక్వెల్ ను బాలీవుడ్ ఎదుర్కుంటుందా అన్నది అనుమానమే. ఎందుకంటే ఓ సౌత్ రీజనల్ మూవీ కేజీఎఫ్2.. రిలీజ్ వీక్ తర్వాత చుక్కలు చూపించే లెక్కలను బాలీవుడ్ కు పరిచయం చేసింది. ఆ దెబ్బకు రాకింగ్ స్టార్ ముందు.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా అడ్రస్ లేకుండా పోయాయి. షాహిద్ కపూర్ జెర్సీ, అజయ్ దేవగణ్ రన్ వే 34, టైగర్ ష్రాఫ్ హీరోపంతి2 సినిమాలు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ముందు నిలబడలేకపోయాయి.

Bollywood Movies: బాలీవుడ్ కి చేతకావట్లేదా? సౌత్ ను చూసి నేర్చుకోవాల్సిందేనా?

హాలీవుడ్ సినిమాలనే తీసుకుందాం.. లాంగ్ రన్ లో ఇండియాలో 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ముందు రణ్ వీర్ 83 విజయం సాధించలేకపోయింది. అంతకుముందు సూర్యవంశీ లాంటి సినిమాలపై షాంగ్ ఛీ, ఎటర్నల్స్ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ గట్టి దెబ్బే కొట్టాయి. రీసెంట్ గా డాక్టర్ స్ట్రేంజ్ సైతం నార్త్ లో మంచి ఓపెనింగ్స్ నే రాబట్టింది.

Bollywood Exhibitors : సౌత్ సినిమాలు లేకపోతే రోడ్డున పడేవాళ్ళం..

మే 27న ఆయుష్మాన్ ఖురానా నటించిన అనేక్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ దక్కుతుంది. కానీ అదే రోజు యాక్షన్ లవర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తోన్న హాలీవుడ్ మూవీ టాప్ గన్ మెవరిక్ రిలీజ్ కానుంది. హై ఇంటెన్స్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ధాటిని తట్టుకోవాలంటే ఆయుష్మాన్ ఖురానా గట్టి స్టఫ్ నే అనేక్ లో చూపించాలి.

Bollywood Heroins: బ్యూటీ విత్ బ్రెయిన్.. స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తున్న హీరోయిన్లు!

జూలై 8న లవ్ అండ్ థండర్ ట్యాగ్ లైన్ తో థోర్ మూవీ రానుంది. అదే రోజున జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, దిశా పఠానీ నటించిన ఏక్ విలన్ రిటర్స్న్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే ట్రిపుల్ ఆర్.. అటాక్ ను ఏమీ చేయలేదని బరిలోకి దూకి వాతలు పెట్టుకున్న జాన్ అబ్రహం.. థోర్ ని ఎలా ఎదుర్కుంటాడో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

Bollywood Couples: ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్.. ప్రేమకు వయసుతో పనేంటి?

బచ్చన్ పాండే ఫ్లాప్ తర్వాత అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ పై హోప్స్ పెట్టుకున్నాడు. జూన్ 3న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. అయితే అదే రోజున సౌత్ నుంచి రెండు పాన్ ఇండియా సినిమాలు అక్షయ్ సినిమాకు పోటీ ఇవ్వబోతున్నాయి. కమల్ హాసన్ విక్రమ్, మహేశ్ ప్రొడ్యూస్ చేసిన మేజర్ పృధ్వీరాజ్ తో పాటే రిలీజ్ కానున్నాయి. వాటికేమాత్రం నార్త్ లో సక్సెస్ టాక్ దక్కినా అక్షయ్ సినిమాపై ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది.

Bollywood Stars: ప్రొడక్షన్ దగ్గర నుంచి ఐపీఎల్ వరకు.. అంతటా స్టార్స్ పెట్టుబడులే!

సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమా వస్తుందంటే బాలీవుడ్ కి వెన్నులో వణుకు పుడుతోంది. ముందు పోటీకీ మేము రెడీ అన్నట్టు ఫోజులు కొట్టినా.. చివరికొచ్చేసరికి పోస్ట్ పన్ అనేస్తున్నారు. పోనీ ధైర్యం చేసి నిలబడితే ఈమధ్య సౌత్ హీరోల కటౌట్ ముందు ఢీలా పడ్డ ఎక్జాంపుల్స్ బోలెడు. సో చేసేదేం లేక ఇక్కడి భారీ ప్రాజెక్టులకు బాలీవుడ్ మేకర్స్ సైడ్ ఇస్తున్నారు. ఇప్పుడు చూస్తే హాలీవుడ్ సినిమాలు మరోవైపు నుంచి టార్గెట్ చేస్తున్నాయి. చూస్తుంటే ముందు నుయ్యి.. వెనుకాల గొయ్య అన్నట్టు తయారైంది బాలీవుడ్ పరిస్థితి.