Bollywood Couples: ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్.. ప్రేమకు వయసుతో పనేంటి?

ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్నారు ఈ బాలీవుడ్ స్టార్ కపుల్. ప్రేమ వయసుని చూసి పుట్టేది కాదు.. మనసుని చూసి పుట్టేది అంటున్నారు ఈ హాట్ కపుల్స్. ప్రేమకి, పెళ్లికి వయసుతో సంబంధం లేదని..

Bollywood Couples: ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్.. ప్రేమకు వయసుతో పనేంటి?

Bollywood Couples

Bollywood Couples: ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్నారు ఈ బాలీవుడ్ స్టార్ కపుల్. ప్రేమ వయసుని చూసి పుట్టేది కాదు.. మనసుని చూసి పుట్టేది అంటున్నారు ఈ హాట్ కపుల్స్. ప్రేమకి, పెళ్లికి వయసుతో సంబంధం లేదని, మనసులు కలిస్తే చాలని ప్రూవ్ చేస్తూ.. కొత్త కపుల్ కు గోల్స్ సెట్ చేస్తున్నారు ఈ బాలీవుడ్ స్టార్లు. 5,6 ఏళ్లంటే కామన్.. కానీ.. 15..16 ఏళ్ల గ్యాప్ తో ప్రేమలో మునిగితేలుతున్న ఆ బాలీవుడ్ జంటలెవరో లెట్స్ హ్యవ్ ఎ లుక్.

Bollywood Couples: అలియా నుండి కరీనా వరకు.. మోస్ట్ హ్యాపెనింగ్ లవ్ మ్యారేజెస్!

ప్రేమకు వయసుతో పనిలేదు. కానీ చూస్తూ.. చూస్తూ.. మరీ 10 ఏళ్లు పెద్దవాళ్లు, 15 ఏళ్లు చిన్నవాళ్లతో ప్రేమ అంటే వినడానికే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మా ప్రేమకు వయసు అడ్డు కాదంటూ ప్రేమలో మునిగి తేలుతున్నారు ఈ కపుల్స్. ఇలా బాలీవుడ్ లో ఇప్పుడుహాట్ టాపిక్ అయ్యారు రణబీర్, ఆలియా. మరో 10 రోజుల్లో పెళ్లిపీటలెక్కబోతున్న ఈ జంట గురించే తెగ మాట్లాడుకుంటోంది సినిమా ఇండస్ట్రీ.

Bollywood Couples : పెళ్లి అప్పుడే అంటున్న బాలీవుడ్ కపుల్స్..!

29 ఏళ్ల వయసులో కెరీర్ ఫుల్ స్పీడ్ మీదున్న టైమ్ లో ఆలియా పెళ్లి చేసుకుంటోంది. రణభీర్ కూడా 40 ల్లోకి వెళ్లకుండా ముందు జాగ్రత్తగా 39 ఏళ్ల వయసులోనే పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఎగ్జాక్ట్ గా 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది రణబీర్-ఆలియాకి. 10 ఏళ్ల వయసు తేడా ఉన్నా కూడా కరెక్ట్ మెచ్యూరిటీతో తమ లవ్ లైఫ్ ని పెళ్లివరకూ తీసుకెళుతున్నారని తెగ ఆనంద పడుతున్నారు ఫాన్స్.

Love Couples: పెళ్లిదేముంది అదే అవుతుంది.. రిలేషన్‌లో ఉన్నాం కదా!

బాలీవుడ్ స్టార్ కపుల్ హృతిక్ రోషన్ మళ్లీ ప్రేమలో పడ్డారని బాలీవుడ్ తెగ హడావిడి చేస్తోంది. 48 ఏళ్ల హృతిక్ రోషన్.. 31 ఏళ్ల యంగ్ అమ్మాయి సబాతో లవ్ ట్రాక్ నడిపిస్తున్నారని సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. సుజానే ఖాన్ తో డివోర్స్ అయిన తర్వాత తనకంటే 17 ఏళ్లు చిన్నదైన సబా ఆజాద్ అనే అమ్మాయితో సమ్ ధింగ్ సమ్ థింగ్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. ఇద్దరూ కలిసి డిన్నర్లకు కూడా వెళ్లడంతో నిజమే అని ఫిక్స్ అవుతున్నారు జనాలు. లేటెస్ట్ గా ఈ వార్తల్ని స్ట్రెన్తెన్ చేస్తూ.. గోవా ట్రిప్ కి చెట్టాపట్టాలేసుకుని వెళ్తున్న వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Star Couples: అంతా మా ఇష్టం.. రెచ్చిపోతున్న హాట్ కపుల్స్!

హృతిక్ రోషన్ నుంచి విడిపోయిన తర్వాత సుజానే ఖాన్ కూడా తన లవ్ లైఫ్ ని సెట్ చేసుకుంటోంది. 43 ఏళ్ల సుజానే ఖాన్.. తనకంటే 7, 8 ఏళ్లు చిన్నవాడైన అర్సన్ గోనితో రిలేషన్ లో ఉందంటూ న్యూస్. అంతేకాదు.. గోవాకి ఇద్దరూ కలిసి చేతిలో చేయి వేసుకుని వెళ్లిన విజువల్స్ తో జనానికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

Malaika Arora: అన్యోన్యజంటగా వెలిగిపోతున్న అర్జున్ మలైకా!

మా ప్రేమకు వయసు అడ్డుకాదని ప్రూవ్ చేసిన బాలీవుడ్ ప్రజెంట్ హాట్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరా. సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్భాజ్ ఖాన్, మోడల్ మలైకా అరోరా ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కానీ డిఫరెన్సెస్ రావడంతో డివోర్స్ తీసుకున్నారు. విడాకులు తీసుకున్నాక 48 మలైకా.. 36 ఏళ్ల హీరో అర్జున్ కపూర్ ని ఇష్టపడింది. వెకేషన్స్ కి కూడా కలిసివెళ్తున్న ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఇద్దరి మధ్యా ఏజ్ గ్యాప్.. 12 ఏళ్లు.

Bollywood Heroins: సౌత్ బాటలో బీటౌన్ హీరోయిన్స్.. కేరాఫ్ టాలీవుడ్!

మలైకా అర్జున్ కపూర్ తో పెళ్లికి రెడీ అవుతుంటే.. ఆర్బాజ్ ఖాన్ కూడా జార్జియా ఆండ్రియాతో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడు. 54 ఏళ్ల ఆర్బాజ్ ఖాన్.. తనకంటే 15 ఏళ్లు చిన్నదైన జార్జియా ఆండ్రియాతో కలిసి ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. తమ ప్రేమను పెళ్లి ద్వారా అఫీషియల్ చేసుకోవాలనుకుంటున్నారు.

Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా తనకంటే వయసులో చాలా చిన్నదైన హీరోయిన్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నారు. 56 ఏళ్ల సల్మాన్ ఖాన్.. 41 ఏళ్ల లులియా వాంటూర్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. కత్రినాతో బ్రేకప్ అయిన తర్వాత లులియాకి కనెక్ట్ అయిన సల్మాన్.. తనకంటే 15 ఏళ్లు చిన్నదైనా కూడా కపుల్ గోల్స్ కంటిన్యూ చేస్తున్నారు.

Bollywood Stars: హిట్ టైమ్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న బాలీవుడ్ బడా స్టార్స్!

బాలీవుడ్ మరో స్టార్ కపుల్ ప్రియాంకా చోప్రా.. భర్త నిక్ జోనస్ మధ్య ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువే. 39 ఏళ్ల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. 29 ఏళ్ల నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా అది జస్ట్ ప్రపంచానికే కానీ మాకు, మా ప్రేమకు కాదు అంటూ హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈ జంట.

Bollywood Star Heroes: కమ్ బ్యాక్ బాలీవుడ్.. హీరోలు బిజీ బిజీ!

ప్రేమకు వయసుతో పనిలేదని ప్రూవ్ చేసిన మరో బాలీవుడ్ సిజిలింగ్ హాట్ కపుల్.. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్. ఆల్రెడీ డివోర్స్ అయిన 51 ఏళ్ల వయసున్న సైఫ్ అలీ ఖాన్ ని వయసులో 10 ఏళ్లు చిన్నదైన 41 ఏళ్ల కరీనా కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. 10 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా యంగ్ జనరేషన్ కి ఏమాత్రం తగ్గకుండా కపుల్ గోల్స్ ఇస్తుంటారు సైఫ్, కరీనా. ఇలా ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అని ప్రూవ్ చేస్తూ బాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఈ జంటలు.