Bollywood Stars: హిట్ టైమ్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న బాలీవుడ్ బడా స్టార్స్!

పేరుకి పెద్ద స్టార్ హీరోలు.. కానీ సూపర్ హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. కమ్ బ్యాక్ కోసం కష్టపడుతున్నారు. బ్లాక్ బస్టర్ కి ఒక్క అడుగు.. ఒకే ఒక్కఅడుగు అనుకుంటూ.. ఆ టైమ్..

Bollywood Stars: హిట్ టైమ్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న బాలీవుడ్ బడా స్టార్స్!
ad

Bollywood Stars: పేరుకి పెద్ద స్టార్ హీరోలు.. కానీ సూపర్ హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. కమ్ బ్యాక్ కోసం కష్టపడుతున్నారు. బ్లాక్ బస్టర్ కి ఒక్క అడుగు.. ఒకే ఒక్కఅడుగు అనుకుంటూ.. ఆ టైమ్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బడా స్టార్ హీరోలు తమ గ్లోరీని గెయిన్ చేసుకోవడానికి కోటి ఆశలతో కొత్త సినిమాల వైపు చూస్తున్నారు. మరి ఈ హీరోలకు కలిసొచ్చే సినిమాలు ఎంత వరకొచ్చాయో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

Bollywood Star Heroes: కమ్ బ్యాక్ బాలీవుడ్.. హీరోలు బిజీ బిజీ!

బాలీవుడ్ స్టార్ హీరోలు డిఫెన్స్ లో పడ్డారు. ఒకప్పుడు స్టార్ హీరోలుగా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు కొట్టి నువ్వా నేనా అన్నట్టు టాప్ ప్లేస్ లో ఉన్న సల్మాన్, షారూఖ్, అమీర్ ఖాన్ ఇప్పుడు సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. అసలే ఫ్లాపులు.. ఆపే కోవిడ్.. దాంతో సినిమా రిలీజ్ కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు ఈ స్టార్ హీరోలు. తమ ఒకప్పటి టాప్ ప్లేస్ ని చేజారనీకుండా చేసే సూపర్ హిట్ కోసం కష్టపడుతున్నారు.

Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

కోవిడ్ టైమ్ లో కూడా సినిమాలు రిలీజ్ చేసి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసిన సల్మాన్ ఖాన్.. బ్లాక్ బస్టర్ ని మాత్రం అందుకోలేకపోయారు. దబంగ్2, రాధే ఈ రెండు సినిమాలూ అనుకన్నంత సక్సెస్ కాలేకపోయాయి. దాంతో సక్సెస్ రేస్ లో కాస్త వెనకబడే ఉన్నారు సల్మాన్. మొన్నీమధ్య అన్తిమ్ మూవీ చేసినా.. అది సల్మాన్ సోలో మూవీ కాదు కాబట్టి.. ఈ సినిమా సక్సెస్ అంత కన్సిడర్ చెయ్యడం లేదు సల్మాన్. అయితే ఇప్పుడు తన క్రేజ్ ని తిరిగి రప్పించే టైగర్ 3 మీదే పుల్ కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్.

Bollywood Heroins: సౌత్ క్రేజ్.. మన హీరోలపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్

సల్మాన్ ఖాన్ కెరీర్ కి మంచి బూస్టప్ ఇచ్చిన టైగర్ సినిమా కి సీక్వెల్ టైగర్ 3 ని కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. కత్రినా కైఫ్ హీరోయిన్ గా పవర్ ఫుల్ కాప్ స్టోరీ గా ఫుల్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 21, 2023లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో మరోసారి సల్మాన్ ఖాన్ తన కలెక్షన్ల స్టామినా మీద కన్నేశారు. ఎలా అయినా సరే.. టైగర్ 3తో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఈమధ్య ఆ రేంజ్ హిట్ అందుకోని సల్మాన్.. ఈ సారి మాత్రం సూపర్ హిట్ కొడతానని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Bollywood Movies: అనౌన్స్‌మెంట్‌తోనే సినిమా చూపించేస్తున్న బాలీవుడ్!

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కూడా 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ అవుతున్నారు. అంతకుముందు వరసగా 5 ఏళ్ల నుంచి ఫ్లాపులు ఫేస్ చేసిన షారూఖ్ ఖాన్.. తన ఫామ్ ని తిరిగి తెచ్చుకోడానికి తెగ ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ దీపికా పదుకోన్ హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా భారీ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న పఠాన్ మూవీ ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

Bollywood Stars: లేట్‌లతీఫ్.. లాగ్ గ్యాప్ తీసుకుంటున్న స్టార్ హీరోలు!

కంప్లీట్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్ 8 ప్యాక్ తో ఇప్పటికే ఫాన్స్ కి పిచ్చెక్కించేస్తున్నారు. అంతేకాదు.. తనకు కమ్ బ్యాక్ మూవీగా ఉంటుందని బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటుందని ఆశలన్నీ పఠాన్ మీదే పెట్టుకున్నారు షారూఖ్. ఈ పవర్ ఫుల్ పఠాన్ మూవీ.. జనవరి 25 2023లో రిలీజ్ కాబోతోంది.

Bollywood Heroins: మారుతున్న రూలింగ్.. హీరోలకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు

బాలీవుడ్ మరో స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా దాదాపు 4 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. అంతకుముందు 2018లో చేసి థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ తో భారీ డిజాస్టర్ ఫేస్ చేసిన అమీర్ ఖాన్.. ఈ సారి ఎలా అయినా హిట్ మూవీగా కమ్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. అతేకాదు వరస ఫ్లాపులతో ఇక సినిమాలు ఆపేద్దామని ఆ మధ్య డిసైడ్ అయ్యానని రీసెంట్ గా రివీల్ చేశారు అమీర్. అయితే ఎలా అయినా సరే సూపర్ హిట్ కొట్టాలన్న ఆశతో మూడేళ్ల నుంచి లాల్ సింగ్ చద్దా ని తీర్చుదిద్దుతున్నారు అమీర్ ఖాన్. ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దాతో అమీర్ ఖాన్ మళ్లీ తన క్రేజ్ ని తిరిగితెచ్చుకుంటానని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.