Bollywood Stars: లేట్‌లతీఫ్.. లాగ్ గ్యాప్ తీసుకుంటున్న స్టార్ హీరోలు!

ఒకప్పుడు హీరోలు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు టెక్నికాలిటీస్ తో పాటు స్కేల్, లెవల్, గ్రాండియర్ పెరిగిపోవడంతో బాగా టైమ్ తీసుకుని సినిమాలు చేస్తున్నారు..

Bollywood Stars: లేట్‌లతీఫ్.. లాగ్ గ్యాప్ తీసుకుంటున్న స్టార్ హీరోలు!

Bollywood Stars

Bollywood Stars: ఒకప్పుడు హీరోలు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు టెక్నికాలిటీస్ తో పాటు స్కేల్, లెవల్, గ్రాండియర్ పెరిగిపోవడంతో బాగా టైమ్ తీసుకుని సినిమాలు చేస్తున్నారు హీరోలు. సంవత్సరానికి ఒక సినిమా కాదు కదా.. కనీసం రెండేళ్లకో సినిమా చెయ్యడం కూడా కష్టమైపోతోంది స్టార్ హీరోలకి. ఇలా లాంగ్ గ్యాప్ తీసుకుంటూ లేట్ గా ఆడియన్స్ ముందుకొస్తున్న హీరోలెవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

Bollywood Releases: కదిలిన బాలీవుడ్.. ఒక్కొక్కరూ రిలీజ్ డేట్ అనౌన్స్!

కరోనా దెబ్బకి అనకున్న షూటింగ్, సినిమా రిలీజ్ లు అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. దీంతో ఆడియన్స్ ముందుకు తొందరగా వద్దామనుకున్న వాళ్లు అంతకంతకూ లేట్ అవుతున్నారు. కానీ ఇక్కడ బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ సీన్ వేరు. 2018 వచ్చిన జీరో సినిమా తర్వాత వాంటెడ్ లీ 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు షారూఖ్. సరే అని సినిమా స్టార్ట్ చేసే లోపు కోవిడ్ బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత తన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు షారూఖ్.

Bollywood Multi Starer: డబుల్ ధమాకా.. బాలీవుడ్‌లో మల్టీస్టారర్ల హవా!

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్.. సిద్దార్ద్ ఆనంద్ తో చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ పఠాన్ సినిమా చేస్తున్నారు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ జనవరి 25, 2023న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేశారు షారూఖ్. అంటే దాదాపు 4 ఏళ్ల తర్వాత షారూఖ్ ఖాన్ ఆడియన్స్ ముందుకొస్తున్నారు.

Bollywood : ఒకే సినిమాలో సల్మాన్, షారుఖ్, హృతిక్.. బాలీవుడ్ బిగ్గెస్ట్ కాంబినేషన్ రాబోతోంది!

మరో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 2018లో వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమా తర్వాత ఆమీర్ ఖాన్ ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. అప్పటి నుంచి లాల్ సింగ్ చద్దా సినిమాతో బిజీగా ఉన్న ఆమీర్ ఖాన్.. 4 ఏళ్ల తర్వాత ఈ సినిమాని రిలీజ్ చెయ్యబోతున్నారు. చాలా సార్లు పోస్ట్ పోన్ అయిన లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ 11న ఆడియన్స్ ముందుకొస్తోంది.

Bollywood Movies: బాలీవుడ్ మైండ్ బ్లాంక్.. సక్సెస్ ఫార్ములా మర్చిపోయిందా?

లేట్ అయినా.. లేటెస్ట్ గా వచ్చి 2019లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టారు హృతిక్ రోషన్. సూపర్ 30, వార్ లాంటి రెండు డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హృతిక్ అదే ఫ్లోలో సినిమాలు చేస్తాడనుకున్నారు కానీ.. 2019తర్వాత ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సైఫ్ అలీఖాన్ తో చేస్తున్న విక్రమ్ వేద సినిమాతో సెప్టెంబర్ లో ధియేటర్లోకొస్తున్నారు.

Bollywood New Films: కొత్తగా కనిపిస్తున్న బాలీవుడ్.. అన్నీ ఇంటెన్స్ డ్రామాలే

బాలీవుడ్ యంగ్ హీరోల్లో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ఉన్న హీరో రణబీర్ కపూర్. రణబీర్ 2018లో సంజయ్ దత్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన సంజూ రిలీజ్ చేశారు. కానీ 4 ఏళ్ల నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యలేదు. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ సంవత్సరం రెండు సినిమాలు టార్గెట్ పెట్టుకున్నాడు. డబుల్ రోల్ చేసిన షంషేరా తోపాటు.. బ్రహ్మాస్త కూడా రిలీజ్ అవుతోంది.