Bollywood Multi Starer: డబుల్ ధమాకా.. బాలీవుడ్‌లో మల్టీస్టారర్ల హవా!

స్క్రీన్ మీద ఎంటర్ టైన్ మెంట్ డబుల్ అవుతోంది. సోలో హీరోగా కాకుండా మల్టీ స్టారర్స్ తో సందడి చేస్తున్నారు అందరూ. ఏదో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే స్టార్లు కాదు.. సినిమా మొత్తం..

Bollywood Multi Starer: డబుల్ ధమాకా.. బాలీవుడ్‌లో మల్టీస్టారర్ల హవా!

Bollywood Multi Starer

Bollywood Multi Starer: స్క్రీన్ మీద ఎంటర్ టైన్ మెంట్ డబుల్ అవుతోంది. సోలో హీరోగా కాకుండా మల్టీ స్టారర్స్ తో సందడి చేస్తున్నారు అందరూ. ఏదో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే స్టార్లు కాదు.. సినిమా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా హీరోలతో ఫైటింగ్ చేసే విలన్లుగా, కోస్టార్లుగా సందడి చెయ్యబోతున్నారు స్టార్లు. స్క్రీన్ నిండా సూపర్ స్టార్లే. ఎక్కడ చూసినా ఫుల్ గ్రాండియర్ తో రెడీ అవుతున్న సినిమాలే. గ్రాండియర్ అంటే బడ్జెట్టే కాదు.. భారీ స్టార్ కాస్ట్ తో, మల్టీస్టారర్స్ తో తెరకెక్కుతున్న సినిమాలే. ఇలా క్రేజీ కాంబినేషన్స్ ఒకటి కాదు.. బాలీవుడ్ లో వరసగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.

Bangarraju: ఓటీటీలో బంగార్రాజు.. ఎప్పుడంటే?

లేటెస్ట్ గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ క్రేజీ కాంబినేషన్లో ఒకప్పటి సూపర్ హిట్ టైటిల్ బడే మియా, ఛోటే మియా టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది. ఈ డబుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనౌన్స్ మెంట్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు ఈ క్రేజీ మల్టీస్టారర్ బడే మియా చోటే మియా సినిమా.. 2023 క్రిస్ మస్ కి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది.

Ravi Teja: కరోనా వేవ్‌ను సక్సెస్ వేవ్‌గా మార్చుకున్న మాస్ రాజా!

ఒకరు యాక్షన్ హీరో, మరొకరు మాంచి కామెడీ టైమింగ్ ఉన్న స్టార్.. ఈ ఇద్దరు కలిసి యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తే.. ఆ క్రేజే వేరు. అలా బాలీవుడ్ లో తెరకెక్కుతోంది విక్రమ్ వేద రీమేక్. తమిళ్ లో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేద మూవీని బాలీవుడ్ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ క్రేజీ కాంబినేషన్లో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటూ సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతోంది.

Aadavallu Meeku Joharlu Teaser: కోపం.. బాధ.. టెన్షన్.. ఫ్రస్టేషన్.. ఇరిటేషన్ చూపించే శర్వా!

బాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో క్రేజీ కాంబినేషన్ పఠాన్ మూవీ. షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ ప్లే చేస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో మరో స్టార్ హీరో జాన్ అబ్రహం ఫుల్ లెన్త్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇలా ముగ్గురు హీరోల కాంబినేషన్తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది పఠాన్ మూవీ.

Tollywood Mega Meeting: సీఎంతో స్టార్స్ భేటీ.. మోహన్ బాబు ఎందుకు మిస్సయ్యారు?

కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ మూవీ టైగర్ సిరీస్ లో మూడో సీక్వెల్ గా వస్తున్న టైగర్ 3లో సల్మాన్ ఖాన్ తో పాటు మరోస్టార్ సందడి చేస్తున్నారు. సీరియల్ కిస్సర్ గా బాలీవుడ్ లో మంచిపేరు సంపాదించుకున్న ఇమ్రాన్ హష్మి ఫస్ట్ టైమ్ భాయ్ తో ఫైటింగ్ చెయ్యబోతున్నాడు. అంతేకాదు.. ఈ సల్మాన్ ఖాన్ సినిమాలో షారూఖ్ కూడా గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు.

CM Jagan-Chiru : సినిమా టికెట్ రేట్లు, థియేటర్లలో షోలపై కమిటీ కీలక ప్రతిపాదనలు

సంజయ్ దత్ సీనియర్ హీరో అయినా అటు విలన్ గా, యంగ్ హీరోలకు కాంబినేషన్ గా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. సంజయ్ దత్ బయోపిక్ ని స్క్రీన్ మీదకి తెచ్చి మంచి అప్లాజ్ అందుకున్న రణబీర్ కపూర్ తో మరో సినిమా చేస్తున్నారు సంజూ భాయ్. సంజూ సినిమాతో మంచి బాండింగ్ ఉన్న రణబీర్ కపూర్, సంజయ్ ధత్ కలిసి మరో సినిమా చేస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ డ్రామా షంషేరా మూవీ సంజయ్ దత్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సంజయ్ దత్.. అక్షయ్ కుమార్ కాంబినేషన్లో చేస్తున్న పృధ్విరాజ్ సినిమాలో కూడా మరో ఫుల్ లెన్త్ రోల్ ప్లే చేస్తున్నారు.

Ram Charan: ముంబై వీధుల్లో రామ్ చరణ్.. ఎందుకు వెళ్లినట్లో?

అమీర్ ఖాన్ లీడ్ రోల్ లో ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో కూడా క్రేజీ కాంబినేషన్ ని చూడొచ్చు. అమీర్ ఖాన్ తో పాటు.. టాలీవుడ్ హీరో నాగచైతన్య కూడా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఏక్ విలన్ సినిమా థీమ్ తో వస్తున్న ఏక్ విలన్ రిటర్న్స్ మూవీ కూడా క్రేజీ కాంబినేషన్స్ తో తెరకెక్కుతోంది. అర్జున్ కపూర్, జాన్ అబ్రహం లాంటి డిఫరెంట్ ఇమేజ్ ఉన్న క్రేజీ హీరోలతో ఈ సినిమా రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది.

Nabha Natesh: కుర్రకారు మదిని దోచేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ!

సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, కలిసి చేస్తున్న మల్టీస్టారర్ బ్రహ్మాస్త్ర. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నాగార్జున కూడా యాక్ట్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో తెరెక్కుతున్న ఈ మైధలాజికల్ సైంటిఫిక్ థ్రిల్లర్ లో భారీ స్టార్ కాస్ట్ తో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇలా ఒకరు కాదు.. డబుల్ త్రిబుల్ కాంబినేషన్స్ తో బాక్సాఫీస్ ధమాకాకి రెడీ అవుతున్నారు స్టార్లు.