CM Jagan-Chiru : సినిమా టికెట్ రేట్లు, థియేటర్లలో షోలపై కమిటీ కీలక ప్రతిపాదనలు

మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ట ధర రూ.250గా ప్రతిపాదించింది. నగర పంచాయతీల్లో నాన్‌ ఏసీ టికెట్ రూ.20నుంచి రూ.40కి పెంచాలని సూచించింది.

CM Jagan-Chiru : సినిమా టికెట్ రేట్లు, థియేటర్లలో షోలపై కమిటీ కీలక ప్రతిపాదనలు

Jagan Chiru

CM Jagan-Chiru : సినిమా టికెట్లు, థియేటర్లలో షోలపై ఏపీ ప్రభుత్వానికి కమిటీ నివేదికను అందజేసింది. చిరు టీమ్‌తో మీటింగ్ సందర్భంగా ప్రభుత్వం.. కమిటీ ప్రతిపాదనలను వారి ముందు ఉంచింది. ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం, చిరు టీమ్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. టికెట్ రేట్లపై కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లలలో నాన్‌ ఏసీ టికెట్ మినిమం ధర 40 రూపాయల నుంచి 60రూపాయలకు పెంచాలని ప్రతిపాదించింది. ఏసీ టికెట్ కనీస ధర 70నుంచి 100రూపాయలకు పెంచాలని సూచించింది. మున్సిపల్ కార్పొరేషన్, మల్టీప్లెక్స్‌లు, నగర పంచాయితీల్లోనూ టికెట్ల ధరలపై కమిటీ ప్రతిపాదనలు చేసింది.

మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ట ధర రూ.250గా ప్రతిపాదించింది. నగర పంచాయతీల్లో నాన్‌ ఏసీ టికెట్ రూ.20నుంచి రూ.40కి పెంచాలని సూచించింది. నగర పంచాయతీల్లో ఏసీ టికెట్ రూ.50 నుంచి రూ.70కి పెంచాలని కోరింది. నగర పంచాయతీల్లోని మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ట ధర రూ.250గా ప్రతిపాదన చేసింది. అలాగే.. ఏపీలో ఐదు షోల సమయాన్ని కూడా కమిటీ ప్రతిపాదించింది. మొదటి షో ఉదయం 8 నుంచి 11గంటల వరకు. రెండవ షో 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు. మూడవ షో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు. నాల్గవ షో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8గంటల వరకు. ఐదవ షో రాత్రి 8 నుంచి రాత్రి 11గంటల వరకు అని ప్రతిపాదనలు చేసింది.

CM Jagan : సినీ పరిశ్రమ విశాఖకు కూడా రావాలి.. జూబ్లిహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దాం : సీఎం జగన్

తెలుగు సినిమా ప్రముఖులతో ఇవాళ క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్‌.నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్‌ రెడ్డి, మహి రాఘవ, ఐ అండ్‌ పీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఐఅండ్‌ పీఆర్‌ కమిషనర్, ఎఫ్‌డిసీ ఎండీ టి విజయ్‌కుమార్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అనంతరం ఏపీ సీఎం జగన్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మంచి పాలసీ తీసుకువచ్చే దిశగా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. అందరికీ న్యాయం జరిగేలా మంచి రేట్లు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారీ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా ట్రీట్ చేయాలన్న జగన్… భారీ బడ్జెట్ సినిమాలకు ప్రత్యేక ధరలు నోటిఫై చేస్తామని ఇవాళ జరిగిన చర్చల్లో సినీ పరిశ్రమ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఏపీలో షూటింగ్‌లు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కనీసం 20శాతం షూటింగ్‌ జరగాలన్నారు.

Bheemla Nayak: ఏపీ ప్రభుత్వ సానుకూలం.. భీమ్లా ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా?

అందరికీ ఒకటే రేట్లు… ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం అందరికీ మంచిదన్నారు. ప్రేక్షకులకు భారం కాకుండా, పరిశ్రమకు మంచి జరిగేలా టికెట్‌ రేట్లు ఉండాలన్నారు. ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి మేలు జరుగుతుందన్నారు. సిని పరిశ్రమ నెమ్మదిగా విశాఖకు రావాలని కోరారు. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తామని చెప్పారు. స్టూడియోలు పెట్టే ఆసక్తి చూపిస్తే వారికి విశాఖలో స్థలాలు ఇస్తామన్నారు. విశాఖలో జూబ్లిహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దామని చెప్పారు.

తెలంగాణతో పోలిస్తే సినీ పరిశ్రమకు ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోందన్నారు. ఏపీలో జనాభా, థిటయేటర్లు ఎక్కువ..ఆదాయం కూడా ఎక్కువేనని తెలిపారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో విశాఖ పోటీ పడగలదన్నారు. రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలని కోరారు. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలన్నారు. సినీ పరిశ్రమ నుంచే దీనికి తగిన కార్యాచరణ ఉండాలని ప్రకటించారు. టికెట్ రేట్లకు సంబంధించి అందరికీ ఒకే రేట్లు అని చెప్పారు. ఆన్ లైన్ పద్ధతిలో టికెట్ల విక్రయం ప్రభుత్వానికి మంచిదని అభిప్రాయపడ్డారు. సినిమా చూసే ప్రేక్షకులకు టికెట్ రేట్ల భారం కాకూడదన్నారు. ఐదో షో వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

Tollywood : జగన్‌తో భేటీ తర్వాత ఎవరెవరు ఏమన్నారంటే..?

మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ… దీనిపై ఒక కమిటీని కూడా నియమించామని పేర్కొన్నారు. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ కూడా తనతో పంచుకున్నారని తెలిపారు.