Bheemla Nayak: ఏపీ ప్రభుత్వ సానుకూలం.. భీమ్లా ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా?

పవన్ ఫాన్స్ పండగ చేస్కోడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని డేస్ కౌంట్ చేసుకుంటున్నారు. ధియేటర్లో పూనకాలతో ఊగిపోవడానికి రెడీ అయిన ఫాన్స్ కు రెండు రిలీజ్ డేట్ల ఎనౌన్స్ మెంట్..

Bheemla Nayak: ఏపీ ప్రభుత్వ సానుకూలం.. భీమ్లా ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా?

Bheemla Nayak

Bheemla Nayak: పవన్ ఫాన్స్ పండగ చేస్కోడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని డేస్ కౌంట్ చేసుకుంటున్నారు. ధియేటర్లో పూనకాలతో ఊగిపోవడానికి రెడీ అయిన ఫాన్స్ కు రెండు రిలీజ్ డేట్ల ఎనౌన్స్ మెంట్ షాకిచ్చింది అయినా, ఎగ్జైట్ మెంట్ తోనే ఎదురు చూస్తున్నారు అభిమానులు. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుందా, లేక ఏప్రిల్ ఫస్ట్ న అవుతుందా అని ఎదురుచూసే ఫాన్స్ ను, పవన్, ఖుషి చేయాడానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఆడియన్స్ ను ఎగ్జైట్ చేయడానికి ఎర్లీ డేట్ నే ఫిక్స్ చేసే ప్లాన్ చేస్తున్నారు భీమ్లానాయక్ టీమ్.

Saniya Iyappan: హీరోయిన్ ఆరుబయట స్నానం.. నెటిజన్ల ఆగ్రహం!

ఏపిలో రీజనబుల్ టికెట్ రేట్స్, 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ పై తెలుగు సినీ ఇండస్ట్రీతో మీటింగ్ అనంతరం థియేటర్లో కోవిడ్ ఆంక్షలు ఎత్తేసే యోచనలో ఉంది ఏపి ప్రభుత్వం. దాంతో ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ రిలీజ్ పక్కా చేసుకోవచ్చు అనుకుంటున్నారు మేకర్స్. ఈ విషయంపైన ఈ టు త్రి డేస్ లోనే ఫుల్ క్లారిటీ రానుంది. ఏపి, తెలంగాణ ఓవర్శీస్ లో భీమ్లానాయక్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయి పోయాయి. ఇక పవన్ కళ్యాణ్ థియేటర్స్ లో ఆడియన్స్ కు తన మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో పూనకాలు తెప్పించడమే బాకీ.

Siva Karthikeyan : జాతిరత్నాలు డైరెక్టర్‌తో శివకార్తికేయన్ సినిమా ప్రారంభం

పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా సాగర్ చంద్ర డైరెక్షన్లో తెరకెక్కిన కాప్ యాక్షన్ ఎంటర్ టైనర్ భీమ్లానాయక్. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్ తో విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫాన్స్. సంక్రాంతి బరిలో రావాల్సిన ఈ సినిమా లేట్ అయ్యింది. రావడం లేటవ్వచ్చునేమో కాని, ఫాన్స్ అంచనాలకు మించి సక్సెస్ కావడం మాత్రం పక్కా అంటున్నారు మేకర్స్. పవన్ కి బాగా కలిసొచ్చిన పోలీస్ క్యారెక్టర్ తో పాటు.. సినిమాలో ఫాన్స్ ని ఎంగేజ్ చేసే హై యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ సినిమాను రెడీ చేశారు టీమ్.