Siva Karthikeyan : జాతిరత్నాలు డైరెక్టర్‌తో శివకార్తికేయన్ సినిమా ప్రారంభం

జాతి రత్నాలు' సినిమాతో భారీ హిట్ కొట్టిన యువ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ఒక సినిమాని ఇటీవల ప్రకటించారు. శివ కార్తికేయన్ 20వ సినిమాగా ఇది తెరకెక్కనుంది.......

Siva Karthikeyan :  జాతిరత్నాలు డైరెక్టర్‌తో శివకార్తికేయన్ సినిమా ప్రారంభం

Siva Karthikeyan

Siva Karthikeyan :  ఇటీవల తమిళ హీరోలు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరోలంతా తమ సినిమాలని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇటీవల తమిళ హీరోలంతా డైరెక్ట్ తెలుగు సినిమాలకి ఓకే చెప్తున్నారు. ఇప్పటికే ధనుష్, విజయ్, కార్తీ, శివ కార్తికేయన్ లాంటి స్టార్ హీరోలు తెలుగులో డైరెక్ట్ సినిమాలు అనౌన్స్ చేశారు.

‘జాతి రత్నాలు’ సినిమాతో భారీ హిట్ కొట్టిన యువ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ఒక సినిమాని ఇటీవల ప్రకటించారు. శివ కార్తికేయన్ 20వ సినిమాగా ఇది తెరకెక్కనుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇటీవల దీనికి సంబంధించిన ఓ థీమ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా కామెడీ నేపథ్యంలోనే ఉండబోతుంది.

Tollywood : జగన్‌ని కలిసిన టాలీవుడ్ స్టార్స్..

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. శివకార్తికేయన్ హీరోగా అనుదీప్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శివకార్తికేయన్ 20వ సినిమా పూజా కార్యక్రమాలు ఇవాళ జరిగాయి. ఇవాళ్టి నుంచే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నట్లు చిత్ర బృందం తెలిపారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ అవ్వనుంది.