Tollywood : జగన్‌ని కలిసిన టాలీవుడ్ స్టార్స్..

గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి సీఎం క్యాంప్ ఆఫీస్ కి చేరుకున్నారు. ఏపీ సీఎం జగన్ కి అందరూ కలిసి పుష్ప గుచ్చం అందించారు. ఈ మీటింగ్ లో చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి...

Tollywood : జగన్‌ని కలిసిన టాలీవుడ్ స్టార్స్..

Chiranjeevi

Updated On : February 10, 2022 / 12:57 PM IST

 

AP CM YS Jagan :  సినిమా టికెట్ ధరల విషయంలో, సినీ పరిశ్రమ సమస్యల కోసం చిరంజీవి ముందుండి నడుస్తున్నారు. ఇప్పటికే గతంలో ఓ సారి ఈ విషయంపై ఏపీ సీఎం జగన్ ని కలిసిన చిరంజీవి ఈ సారి మరింతమంది టాలీవుడ్ ప్రముఖుల్ని తీసుకొని వెళ్లారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రైవేట్ విమానంలో చిరంజీవితో పాటు మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ.. మరికొంతమంది పెద్దలు జగన్ ని కలవడానికి వెళ్లారు.

గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి సీఎం క్యాంప్ ఆఫీస్ కి చేరుకున్నారు. ఏపీ సీఎం జగన్ కి అందరూ కలిసి పుష్ప గుచ్చం అందించారు. ఈ మీటింగ్ లో చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణ మురళి, ఆలీ, ఆర్ నారాయణ మూర్తి ఉన్నారు.

Allu Arha : ‘కచ్చా బాదమ్’ పాటకి అల్లు అర్హ క్యూట్ స్టెప్స్.. మై లిటిల్ బాదం అంటూ షేర్ చేసిన బన్నీ

ప్రస్తుతం వీరంతా సినీ సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశం అయ్యాక అక్కడే తాడేపల్లిలో మీడియాతో మాట్లాడనున్నారు. ఇవాళ్టి సమావేశంతో సినీ పరిశ్రమ సమస్యలకి, సినిమా టికెట్ల వివాదానికి ఎండ్ కార్డు పడుతుందని అంతా భావిస్తున్నారు.