Saniya Iyappan: హీరోయిన్ ఆరుబయట స్నానం.. నెటిజన్ల ఆగ్రహం!

ఒక్కొక్కరిది ఒక్కో పిచ్చి. మరికొందరికి పిచ్చి ముదిరి పైత్యంగా మారి సమాజాన్ని మర్చిపోయి బిహేవ్ చేస్తుంటారు. ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా.. కొందరు సినిమాల వాళ్ళ గురించే ఇది.

Saniya Iyappan: హీరోయిన్ ఆరుబయట స్నానం.. నెటిజన్ల ఆగ్రహం!

Saniya Iyappan

Updated On : February 10, 2022 / 3:15 PM IST

Saniya Iyappan: ఒక్కొక్కరిది ఒక్కో పిచ్చి. మరికొందరికి పిచ్చి ముదిరి పైత్యంగా మారి సమాజాన్ని మర్చిపోయి బిహేవ్ చేస్తుంటారు. ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా.. కొందరు సినిమాల వాళ్ళ గురించే ఇది. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్, నటీమణులు కొందరు బికినీ అంటే అదేదో బిస్కెట్ తినేసినంత సింపుల్ గా వేసేస్తున్నారు. అంతేకాదు.. వెకేషన్ల పేరుతో షికార్లుకి వెళ్లడం.. బికినీతో ఫోటోషూట్లు చేసి సోషల్ మీడియాలో పెట్టడం ఈ మధ్య కాలంలో చాలా కామన్ గా మారిపోయింది.

Son of India: లాంగ్ గ్యాప్ తర్వాత మోహన్ బాబు.. ట్రైలర్ ఎప్పుడంటే?

మలయాళ హీరోయిన్‌ సానియా అయ్యప్పన్‌ కూడా అలాగే ప్రకృతిలో స్నానం చేసింది. అంటే ఆరుబయట పచ్చని మొక్కల దగ్గర బికినీలో షవర్‌ బాత్ చేసింది. దాన్ని వీడియో రికార్డ్ చేసి వీడియోను తెచ్చి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్ కాగా నెటిజన్లు సానియాపై కామెంట్లతో విరుచుపడుతున్నారు. ఆరుబయట స్నానం చేస్తున్నావ్ కొంచెం కూడా సిగ్గులేదా అంటూ మండిపడుతున్నారు. ఇలా వీడియోలు షేర్ చేస్తే.. ఈవ్‌ టీజింగ్‌ కేసులు ఎలా తగ్గుతాయని కామెంట్లు చేస్తున్నారు.

Tollywood : టాలీవుడ్ మీటింగ్ సమావేశం సారాంశం ఇదే..

ఇక.. ఈ కామెంట్లకు స్పందించిన సానియా అసలు సిగ్గంటే ఏంటో చెప్తారా? అని సెటైరిక్‌గా కౌంటర్‌ ఇవ్వడం విశేషం. దీనికి మరింత రెచ్చిపోయిన నెటిజన్లు కొందరు సిగ్గు లేకనే ఇలా అర్ధనగ్న వీడియోలు షేర్ చేసి రెచ్చగొడ్తున్నావ్ అంటూ మండిపడ్డారు. కాగా సానియా నటించిన క్వీన్‌, లూసిఫర్‌ సినిమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టగా.. ప్రస్తుతం దుల్కర్‌ సల్మాన్‌ సరసన ‘సెల్యూట్‌’ మూవీలో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Saniya Iyappan (@_saniya_iyappan_)