Son of India: లాంగ్ గ్యాప్ తర్వాత మోహన్ బాబు.. ట్రైలర్ ఎప్పుడంటే?

టాలీవుడ్ హీరోలంతా కరోనా ముప్పతిప్పలు పెడుతున్నా లెక్క చేయకుండా వరస పెట్టి సినిమాలు సిద్ధం చేస్తున్నారు. అయితే.. సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ నుండి మాత్రం..

Son of India: లాంగ్ గ్యాప్ తర్వాత మోహన్ బాబు.. ట్రైలర్ ఎప్పుడంటే?

Son Of India

Son of India: టాలీవుడ్ హీరోలంతా కరోనా ముప్పతిప్పలు పెడుతున్నా లెక్క చేయకుండా వరస పెట్టి సినిమాలు సిద్ధం చేస్తున్నారు. అయితే.. సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ నుండి మాత్రం సినిమాలు రావడం లేదు. మోహన్ బాబు.. కుమారులు విష్ణు, మనోజ్ యాక్టివ్ గా సినిమాలు తీసుకురాలేకపోతున్నారు. మోహన్ బాబు ఆ మధ్య స్టార్ హీరోల సినిమాలలో ముఖ్య పాత్రలతో రాగా.. ప్రధాన పాత్రలో సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. ఇప్పుడు ఆ లోటు భర్తీ చేసేందుకు సిద్దమయ్యాడు మోహన్ బాబు.

Tollywood : టాలీవుడ్ మీటింగ్ సమావేశం సారాంశం ఇదే..

మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఫస్ట్ లుక్ తోనే మంచి బజ్ ను తెచ్చుకున్న సన్నాఫ్ ఇండియాపై ప్రేక్షకులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పుడు మేకర్స్ రిలీజ్ కి సిద్ధం చేస్తుండగా ట్రైలర్ లాంచ్ తో ప్రమోషన్ కూడా మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది.

Siva Karthikeyan : జాతిరత్నాలు డైరెక్టర్‌తో శివకార్తికేయన్ సినిమా ప్రారంభం

ఈరోజు ఫిబ్రవరి 10న సాయంత్రం 4 గంటలకు సన్నాఫ్ ఇండియా ట్రైలర్ విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. డైమండ్ రత్న బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ను అప్పుడు స్టార్ హీరో సూర్య లాంచ్ చెయ్యగా ఇప్పుడు ట్రైలర్ ఎవరు రిలీజ్ చేస్తారన్నది ఆసక్తిగా కనిపిస్తుంది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాను మంచు విష్ణు నిర్మించాడు. ఫిబ్రవరి 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.