Ravi Teja: కరోనా వేవ్‌ను సక్సెస్ వేవ్‌గా మార్చుకున్న మాస్ రాజా!

కోవిడ్ టైమ్ ను చాలా ప్లాన్డ్ గా వాడుకున్న టాలీవుడ్ హీరో రవితేజనే. క్రాక్ ఇచ్చిన సక్సెస్ వేవ్ తో కరోనా వేవ్స్ ను లెక్క చేయట్లేదు మాస్ రాజ. వరుసగా సినిమాలు చేస్తూ వన్ బై వన్ రిలీజ్..

Ravi Teja: కరోనా వేవ్‌ను సక్సెస్ వేవ్‌గా మార్చుకున్న మాస్ రాజా!

Ravi Teja: కోవిడ్ టైమ్ ను చాలా ప్లాన్డ్ గా వాడుకున్న టాలీవుడ్ హీరో రవితేజనే. క్రాక్ ఇచ్చిన సక్సెస్ వేవ్ తో కరోనా వేవ్స్ ను లెక్క చేయట్లేదు మాస్ రాజ. వరుసగా సినిమాలు చేస్తూ వన్ బై వన్ రిలీజ్ కూ ప్లాన్ చేశాడు. లాస్ట్ ఇయర్ కోవిడ్ టైమ్ లో క్రాక్ వచ్చి మాసివ్ హిట్ ఇచ్చింది. ఈ ఇయర్ ఖిలాడి వచ్చి మ్యాజిక్ చేస్తుందా అన్నది చూడాలి.

Bheemla Nayak: ఏపీ ప్రభుత్వ సానుకూలం.. భీమ్లా ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా?

వీర తర్వాత రమేష్ వర్మ డైరెక్షన్ లో రవితేజ నటిస్తున్న సినిమా ఖిలాడి. ఖిలాడిలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు మాస్ రాజ. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి రవితేజ సరసన నటించారు. మరో కీలక పాత్రలో అర్జున్ కనిపించనున్నాడు. ఏపిలో ఇంకా కోవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తేయకుండానే ఈ ఫిబ్రవరి 11న థియేటర్లో దిగుతున్నాడు మాస్ రాజ ఖిలాడి.

Saniya Iyappan: హీరోయిన్ ఆరుబయట స్నానం.. నెటిజన్ల ఆగ్రహం!

లాస్ట్ ఇయర్ కోవిడ్ సెకెండ్ వేవ్ టైమ్ లోనే క్రాక్ రిలీజ్ అయ్యింది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో హాట్రిక్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం రమేశ్ వర్మ కాంబినేషన్ లో్ వస్తోన్న సెకెండ్ మూవీ ఖిలాడి చేయబోతున్న స్మార్ట్ ప్లే మీదే ఆసక్తి నెలకొంది. ఈ సారి హిందీలో కూడా రిలీజ్ ప్లాన్ చేసిన ఖిలాడి ప్రిరిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు రమేశ్ వర్మ టీమ్.

Son of India: లాంగ్ గ్యాప్ తర్వాత మోహన్ బాబు.. ట్రైలర్ ఎప్పుడంటే?

ఖిలాడి ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. ట్రయిలర్ టాప్ 1 ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ ఆల్బమ్ మ్యాజికల్ హిట్ అయ్యింది. రమేష్ వర్మ, రవితేజ కాంబోలో గతంలో వీరా వచ్చి యావరేజ్ సక్సెస్ నే అందుకుంది. ఇప్పుడు మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలన్న గట్టి పట్టుదలతో భారీ బడ్జెట్ సినిమా చేశారు రమేశ్ వర్మ. లాస్ట్ ఇయర్ కోవిడ్ సెకెండ్ వేవ్ లో వచ్చి మాసివ్ సక్సెస్ అయిన క్రాక్ లాగే, ఈ ఇయర్ కోవిడ్ థర్డ్ వేవ్ లో వచ్చి, ఖిలాడి మాసివ్ సక్సెస్ అయ్యి మ్యాజిక్ చేస్తుందేమో అనుకుంటున్నారు మూవీ అనలైజర్స్.