Bollywood New Films: కొత్తగా కనిపిస్తున్న బాలీవుడ్.. అన్నీ ఇంటెన్స్ డ్రామాలే

టాలీవుడ్ తో పోటీగా బాలీవుడ్ కొత్త సరుకును దించుతోంది. వరుసపెట్టి టీజర్స్, ట్రైలర్స్, లిరికల్ సాంగ్స్ తో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. త్వరలో రిలీజ్ కాబోయే 83 నుంచి 2023లో..

Bollywood New Films: కొత్తగా కనిపిస్తున్న బాలీవుడ్.. అన్నీ ఇంటెన్స్ డ్రామాలే

Bollywood New Films

Bollywood New Films: టాలీవుడ్ తో పోటీగా బాలీవుడ్ కొత్త సరుకును దించుతోంది. వరుసపెట్టి టీజర్స్, ట్రైలర్స్, లిరికల్ సాంగ్స్ తో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. త్వరలో రిలీజ్ కాబోయే 83 నుంచి 2023లో వచ్చే రణ్ బీర్ – ఆలియాల ప్రేమ్ కహానీ వరకు కొత్త బొమ్మలిప్పుడు ఫుల్ వైరల్ గా మారాయి.

OTT Release: ఒరిజినల్స్‌కు ఊపిరాడకుండా చేస్తున్న వెబ్ సిరీస్‌లు!

కొత్తగా కనిపిస్తోంది బాలీవుడ్. వరుస టీజర్స్, ట్రైలర్స్ తో జోరు పెంచింది. ఇప్పటికే డిసెంబర్ 3న రిలీజ్ కాబోయే తడప్ ట్రైలర్స్, సాంగ్స్ ఓ రేంజ్ లో అట్రాక్ట్ చేస్తున్నాయి. ఆర్ ఎక్స్ 100కి మించిన ఇంటిమేషన్ సీన్స్, ఇంటెన్స్ డ్రామాతో తెరకెక్కిన దాని రీమేక్ తడప్ గురించి యూత్ లో ఫుల్ బజ్ క్రియేట్ చేసారు మేకర్స్. అహాన్ శెట్టి, తారా సుతారియా పెయిర్ తడప్ సినిమా వాళ్లకి బ్రేక్ తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు.

Radhe Shyam: పూజ పాత్రకి విషాదాంతం.. అప్డేట్స్ ఏం చెప్తున్నాయ్?

బాలీవుడ్ ఆడియెన్స్ మోస్ట్ అవైటైడ్ మూవీ 83. డిసెంబర్ 24న థియేటర్స్ కి రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజై ట్రెండింగ్ లో ఉంది. హిందీతో పాటూ సౌత్ లాంగ్వెజెస్ లో రిలీజ్ కాబోతున్న 83లో ఎమోషన్స్ ను బాగానే క్యారీ చేసారు మేకర్స్. ముఖ్యంగా కపిల్ దేవ్ గా రణ్ వీర్ సింగ్ యాప్ట్ అయ్యాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక 1983లో గెలుచుకున్న వరల్డ్ కప్ మూమెంట్స్ ట్రైలర్ లో చూస్తుంటేనే గూజ్ బంప్స్ తెప్పిస్తుంటే.. థియేటర్ దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు.

Ajith Kumar: నయా ట్రెండ్.. తోకలొద్దు.. నా పేరే నాకు ముద్దు!

సేమ్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న సినిమా జెర్సీ. కాకపోతే ఇది ఎవరి బయోపిక్ కాదు. తెలుగులో మంచి పేరుతెచ్చుకున్న నాని జెర్సీకి యాజ్ ఇట్ ఈజ్ రీమేక్. ఫ్యామిలీ ఎమోషన్స్ ని అటాచ్ చేసిన స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన జెర్సీ బాలీవుడ్ ఆడియెన్స్ కు సూపర్ గా కనెక్టయింది. లేటెస్ట్ ట్రైలర్ తో ఒక్కసారిగా లవ్ యూ షాహిద్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. సో హిందీ జెర్సీ కూడా సూపర్ హిట్ పక్కా అన్న ధీమా ట్రైలర్ తో కొట్టేసారు మన తెలుగు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. డిసెంబర్ 31న విషయం ఏంటన్నది తేలిపోతుంది.

Salman Khan: సల్లూ భాయ్‌ని వాడేసుకుంటున్న తెలుగు హీరోలు!

అప్పుడప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడం ధనుష్ కి అలవాటే. అయితే కాస్త గ్యాప్ ఇచ్చి అత్రాంగి రే సినిమాతో మళ్లీ అక్కడ ఎంట్రీ ఇస్తున్నాడు. అక్షయ్ కుమార్ తో కలిసి ఫన్ చేయబోతున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో అక్షయ్, ధనుష్, సారా అలీఖాన్ నటించిన ట్రయాంగిల్ లవ్ డ్రామా అత్రాంగి రే ట్రైలర్ ఫుల్ గా ట్రెండ్ అవుతోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన పాటలు సైతం కలరింగ్ ఇస్తున్నాయి. కాకపోతే సినిమా మాత్రం థియేటర్స్ కాకుండా హాట్ స్టార్ లో డిసెంబర్ 24న డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేస్తోంది.

Akhanda: బాలయ్య మాస్ జాతర.. హ్యాట్రిక్ సక్సెస్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

ఆషికీ ఆ గయీ అంటూ రీసెంట్ గా అప్డేట్ అయ్యాడు రాధేశ్యామ్. సంక్రాంతికి ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న పీరియాడికల్ ఫిల్మ్ రాధేశ్యామ్ గురించి బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ అప్ డేట్స్ విషయంలో కాస్త వెనుకబడిన టీమ్… ఈసారి మాత్రం ఫ్యాన్స్ ను ఫిదా చేసేసింది. ప్రభాస్, పూజా హెగ్డేల రొమాన్స్ పాటకే హైలైట్ గా మారింది.

Evaru Meelo Koteeswarulu: ముహూర్తం ఫిక్స్.. కోటి ప్రశ్న ముందు అడిగేయ్ తారక్!

బాలీవుడ్ న్యాచురల్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా.. కొత్త వేరియేషన్స్ చూపిస్తున్నాడు. నయా ఫిల్మ్ చండీఘర్ కరే ఆషిఖీ మూవీలో సాలిడ్ బాడీతో ప్రొజెక్ట్ అవుతూనే వాణీకపూర్ తో డీప్ రొమాన్స్ సీన్స్ లో హాట్ రచ్చ చేసాడు. డిసెంబర్ 10న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అభిషేక్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సాంగ్స్ కూడా ఆడియెన్స్ ట్రాక్ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాయి.

RRR: జనవరి 7 విడుదల.. బాహుబలి కోటను బద్దలు కొట్టగలరా?

2023 ఫిబ్రవరి 10న వస్తున్నామని ఇప్పుడే చెప్పేసాడు కరణ్ జోహార్. ఆయన డైరెక్ట్ చేస్తోన్న రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసాడు. దాదాపు 7సంవత్సరాల తర్వాత క్లాసిక్ లవ్ స్టోరీని టచ్ చేస్తున్నాడు కరణ్ జోహార్. రణ్ వీర్ సింగ్, ఆలియా జంటగా కనిపించబోతున్న ఈ ప్రాజెక్ట్ లో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా హజ్మీ లాంటి సీనియర్ స్టార్స్ మెస్మరైజ్ చేసే రోల్స్ లో కనిపించబోతున్నారు.